నెల్లూరు

సృష్టి విరుద్ధం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెత్తకుప్పపై విసిరెయ్యటానికి
అది చెత్తా, చెదారమా?
పనికిరాని వస్తువా? లేక
పగిలిపోయిన వస్తువా?
రక్తమాంసాలతో రూపుదిద్దుకున్న ప్రాణం
గర్భమనే గుడిలో వెలసిన బ్రహ్మతేజం
ఆడపిల్ల అయినంత మాత్రాన
ముళ్లకంపల్లోకి విసిరేస్తారా?
నవమాసాలు మోసి, నవనాడుల బొమ్మను
కనేది, ఈ రాక్షస కృత్యానికేనా?
కట్నమిచ్చుకోవాలన్న భయమే కాని
కడుపుతీపి కాస్తయినా కదలాడదా?
తను విద్యావంతురాలిగా చెయ్యమంటుందా?
లేక ఉద్యోగినిగా మలచమంటుందా?
రెక్కకు రెక్కై ఒక పక్క నుండే
ఆడబిడ్డ కదా అది
పెరిగి పెద్దై తలనొప్పులు తెచ్చిపెట్టే
మగబిడ్డ కాదుకదమ్మా
కడుపున పుట్టిన బిడ్డను కర్కశంగా
చంపే కసాయితనం సృష్టివిరుద్ధమమ్మా!
పూలపొద, ముళ్లపొదగా మారటం
చల్లని వెనె్నల మండే ఎండై మండటం
కలికాలామా? లేక విధి వైపరీత్యమా?

- తోట శ్రీనివాసరావు, లెక్చరర్
మార్కాపురం. చరవాణి : 8977066980
**

త్రిశంకు స్వర్గం

పురిటి నొప్పులు పడకుండానే
పండంటి బిడ్డ పొత్తిళ్లు చేరుతోంది
స్తన్యాస్వాదన మాధుర్యాన్ని చవిచూడకుండానే
పసిపాపల కడుపు పాలడబ్బాల పాలయింది
‘‘అమ్మా’’ అనే పిలుపు ఆచూకే దక్కలేదు
‘‘మమీ’’ల గోలే మాధుర్యమయింది
పలకల రూపురేఖలు చూడకుండానే
పిల్లవాని చదువు పరుగెత్తుతోంది
పరుగులెత్తి ఆటలాడుకునే వయసులో
పీఠం కానె్వంట్ బండకు అతుక్కుపోయింది
అమ్మచేతి గోరుముద్దలు తెలియవు
‘‘టప్పర్‌వేర్’’ బాక్సులో చల్లారిన ముద్దలు తప్ప
తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మల
పదాలు వినిపించడమే తప్ప
ఆ ఆకారాలెప్పుడూ కనిపించలేదు
అష్టకష్టాలు పడో, అన్యాయాల పాలపడో
అర్థాన్ని సంపాదించే ఆదుర్దాలో నాన్న
అలవిమాలిన ఆర్భాటపు ఆశలతో
అటుయిటు వాళ్ల పోటీతో ఉనికిని కోల్పోయి
‘‘ ఒంటికొమ్ము శొంఠి’’ జీవితాలు
ముద్దుగా మారి
పుట్టిన పసికందులకు ప్రేమలు కరువై
పుట్టుకతోనే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ
అందరూ వున్న అనాథలై బ్రతుకుతున్నారు
ఒంటరి తనానికి అలవాటుపడ్డ జీవితం
వయసుమళ్లిన వారిని వృద్ధాశ్రమాలకు
విసరివేస్తోంది
ఎక్కడ వున్నది లోపం!
క్రమశిక్షణ పేరుతో బంధాలకు దూరం చేసి
వసతిగృహాలకు పసివయసును తాకట్టుపెట్టి
ప్రయోజకులను చేస్తున్నామని
భ్రమించే పెద్దలదా?
అనురాగాలకు అభిమానాలకు దూరంగా పెరిగి
కన్నవాళ్లను ఎలా చూడాలో తెలియక
ఖర్చుపెట్టి ఆశ్రమాలకు పంపి అదే గొప్పనుకుని
ఆనందంతో పొంగిపోయే పిల్లలదా?
ఎవరినీ నిందించలేని అయోమయ స్థితి
త్రిశంకు స్వర్గంలో బ్రతుకీడుస్తున్న దుస్థితి
యంత్రాల మధ్య యాంత్రికంగా జీవిస్తూ
మరమనుషులుగా మనం మారిపోతున్నాం
స్పందనరహిత జీవులుగా మిగిలిపోతున్నాం..!

- శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు
చరవాణి : 9052048706
**
సోదరా.. కర్షక ధీవరా..!

మన దేశం...
ఆచారాలు, సంప్రదాయాల దేశం
సమైక్యతా సంఘజీవన ప్రదేశం
ఉపాధి కరువై నేడు వలసల దేశం
కరమున హలమును విడచి
జన్మభూమిపై అలిగి
పరాయి ఊళ్లో పదిలమనుకొని
బిక్కుబిక్కుమను బేల చూపులు
పనీబాట కోసం పడిగాపులు...
మన రైతులు..
వలస బతుకులు
బలుసాకు మెతుకులు
ఆశలేని మనసులు
ఆవిరైన వయసులు
ప్రభుత్వ చిల్లుల వలలో
రైతులు వలసల ఉలసలై
నిలకడలేని నిర్భాగ్యులు...
మన ఆశ...
కృషీవలుల వలసల సలసల
భవిష్యత్ ఊహిస్తే మనసు విలవిల
గొంతయినా తడవదా ఈ వత్సరం
ఆకలితీర్చే అన్నదాతవు నీవురా
చినుకుపై ఆశ కల్గి ఉండరా
నీ ప్రాణాలను నిలుపరా
సోదరా..! కర్షక ధీవరా..!
- యర్రాబత్తిన మునీంద్ర, నాయుడుపేట
చరవాణి : 8331844527

**
కవిత
**
కొత్త‘్ధనం’

కొత్తదనం..కొత్త్ధనం
కొత్త‘్ధనం’
కరువు..కరువు
పాత‘్ధనం’
జమకట్టడానికి
పడరాని పాట్లు
కొత్త‘్ధనం’ తేవడాన్కి
వరుసలో ఇక్కట్లు
నల్ల‘్ధనానికి’
చెల్లింది కాలం
మనది కానిదేదీ
మనీ దగ్గర ఉండదనేది వాస్తవం
తెలియచెప్పాలన్నది
నమోవ్యూహం
లంచగొండులకు
అవినీతిపరులకు కావాలి
జ్ఞానోదయం..!

- పి.కాశీవిశ్వనాధం
9494524445
**

అమ్మ జ్ఞాపకం

అమ్మ బాహ్య ప్రపంచపు
అంచులుదాటి
వెళ్లిందేమోకాని!
నా మానసమహతీ మీటి
సుస్వరతరంగమై
తచ్చాడతూనే వుంది
కళ్లముందు అమ్మబొమ్మ..!
కనుమరుగైందని
నేను అనుకోవడం లేదు
ఎందుకంటే!
నా హృదయపు ప్రేమలో
అమ్మబొమ్మ స్థిర చిత్రమై
వ్రేలాడుతూనే వుంది
నాలో కదిలే అణువణువులో
ఆమె జ్ఞాపకాల సుమాలే
పరిమళిస్తున్నాయి
ఆమె మధురస్మృతి
రమ్యాతిరమ్యం
ఆమె ఆప్యాయతలు
నిండిన ప్రేమ వెలలేని కావ్యం
అందుకే!
అమ్మ జ్ఞాపకం
ఓ చెరగని చెదరని
శిలాక్షరం..!
అమ్మ జ్ఞాపకం
నా గుండెగుడిలో
నిక్షిప్తమైన
గుప్త ధనపు
దివ్యభాండాగారం..!

- కొర్రపాటి వెంకటరమణయ్య
రిటైర్డ్ తెలుగుపండిట్, బుచ్చి
చరవాణి : 9494583241
**
ప్రేమ

ఆమెను
నేను ప్రేమిస్తున్నా
ఆమె కూడా నన్ను
ప్రేమిస్తుంది
నేను సామాన్య మానవున్ని
ఆమె అతిలోక సుందరి
అయినా ప్రేమిస్తుంది
నేను కూడా మనసారా ప్రేమిస్తున్నా
మమ్మల్ని చూసి అందరూ
అసూయతో కుళ్లుకుంటారు
చివరకు
మాఆవిడ కూడా!
బయటికి వెళ్లేటప్పుడు
ముద్దులే!
ఇంట్లోకి వచ్చినపుడూ
ముద్దులే!!
కౌగిలి మా దినచర్య
ఎక్కడైనా కనిపిస్తే చాలు
ప్రపంచాన్ని మర్చిపోయి
నన్ను నట్టింట్లో నిట్టాడిని చేసి
తాను మల్లితీగై
అల్లుకు పోతుంది..
ప్రతిరోజూ నన్ను
తన కౌగిలిలో బంధించి
నన్నుతుక్కుపోయే - ఎండిబల్లి
తను - మూడేళ్ల
నా బంగారుతల్లి.

- ఈదూరు సుధాకర్, నెల్లూరు
చరవాణి : 98495 61613