నెల్లూరు

హేమలంబకి ఆహ్వానం (ఉగాది కవిత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖగోళ దూరాల నుండి
నక్షత్రశాలలు దాటుకొంటూ
గ్రహాలు, ఉపగ్రహాలను
పలకరించుకొంటూ
భూగోళమంతా నవ్యకాంతులు నింపుతూ
వెలుగుల వాకిట నిలబడమని
ఉగాదిని ఆహ్వానిస్తున్నా...

శిశిరం వీడి
నిరాశా నిస్పృహలను వదలి
వసంత ఋతువుకు అండగా
ఆశల పల్లకిలో ఆమనితోడుగా
చెరుకు గడల ధనువు తోడుగా
సుమబాణాల పొదినిండుగా
సిగ్గులమొగ్గల చిగురుటాకులు కాగా
చెవిబుగ్గల సింగారాల్లాగా
ఆమని వనిలోనికి వేడుక కల్గంగా
చైతన్య రథమును బూని
ప్రభాత కిరణాల సోయగాలలో తడువంగా
‘మన్మథుని’ తృప్తిగ ఆహ్వానిస్తున్నా...

రాలుతున్న ఆకులు
మానుతున్న గాయాలు
మొలుస్తున్న పూతలు
మరమ్మతులు విషాదాల గురుతులు
మారాకులు, మామిడాకులు, చిగురుటాకులు
చిగురించే భవిష్యత్ ఆశలు
నిరుత్సాహ నిర్వేదపు బాటలు వీడి
ఆయుః ప్రమాణాలు పెంచుకుని
కాంతుని కరుణతో రమ్మని ఆహ్వానిస్తున్నా....

కళ్లకు కాటుక చెవులకు జూకాలు
శిగలో మల్లెపూలు
నుదుట తిలకము
నల్లని కురులు
ఎర్రని పెదవులు
కరకంకణాలు గలగలలు
చరణ కింకిణుల స్వనాలతో
వెండివెనె్నల దారాల నడుమ
గండుకోయిల పాటల సందున
చీకటిదారులు విడిచి కృష్ణశాస్ర్తీ గీతంలా
వెలుగు నేత్రాలతో నండూరి ఎంకిలా
ఆశల పల్లకిలో ఊరేగి రమ్మని
విశ్వనాధ వసంత కన్యను ఆహ్వానిస్తున్నా...

కవితా కన్యకై, కల్పిత ప్రబంధ నాయకివై
ఊహాసుందరివై, ఊర్వశివై, రతివై, రమణివై
పురాణాల ఉల్లేభినీయ ఉషవై
చరిత్రపుట చర్వితచరిణివై
కవుల ఊసుల కౌగిలింతవై
పదివై, అష్టపదివై, సప్తపదివై
రసరమ్య గీతమై, మనసున మెచ్చే భావనవై
భక్తిగీతమై, ఆర్ద్రతా గేయమై,
ఆనంద ధారవై
ప్రబోధ పంక్తివై, అవధానాల ధారవై
ఓర్పు, నేర్పు, చేర్పు, మార్పు, కూర్పుల అక్షరమై
భాషా పటిమ కలకండవై
చైత్రమాస తొలిదిన ఉషస్సువై
రమ్మని ఆహ్వానిస్తున్నా...
తీపి, పులుపు, కారం, వగరుల పచ్చడివై
ఆనందం, ఆవేదన, సుఖదుఃఖాల సమ్మిళితవై
భూత భవిష్యదర్శన పంచాంగ శ్రవణిమై
దుర్ముఖి పంచిన గురుతుల స్మృతియై
హేమలంబలో బంగరు భవితను
కల్గించమని
జనులందరికి ఆనందోత్సాహాలు పంచమని
హేమలంబని ఆహ్వానిస్తున్నా...

- లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి
చరవాణి : 9849166951
**
నా..నీ..!

గోపి గారి నానీ కాదు
కీరవాణి బాణీ కాదు
నా ఎవరో..నీ ఎవరో..?
నా ఉషస్సు నీ తేజస్సు
నా వర్చస్సు నీ మనస్సు
నా తపస్సు నీ యశస్సు
నా అందం నీ చందం
నా బంధం నీ అనుబంధం
నా వినయం నీ అభయం
నా రసయుక్తం నీ ఆలింగనం
నా హృదయం నీ ఉదానం
నా..నీ..కలయిక
నా.. నీ.. కదలిక
నువ్వెవరో నేనెవరో ప్రధానం కాదు
కానీ...నువ్వు నేను సృష్టికి మూలం
నా కాయమైతే..
నీ ప్రాణమై విశ్వగతిని మార్చింది
అదే జీవిత గమనం..!

- యర్రాబత్తిన మునీంద్ర
చరవాణి : 8331844527