విశాఖపట్నం

నువ్వు నేను ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటరిగా ఉంటున్న నేను
సదా నిత్య సంతోషిని అనుకున్న
నా చుట్టూ ఉన్న ప్రపంచంలో
నేనొక అవిశ్రాంత జీవిని
స్వేచ్ఛగా విహరించే నేను
కట్టుబొట్టు, ఆచారాలు
ఆప్యాయతలు అన్నీ ట్రాష్ అనుకున్నా
అప్పుడే కలిగింది నాకొక
వింతైన అందమైన అనుభవం
అదే నా జీవన గమనంలోకి నీ ఆగమనం
అదొక సుధా స్రవంతి
అనురాగ విపంచి
నీ రాక నా జీవితానికొక ఏరువాక
నీ తోడు కావాలని అదే స్నేహ
మాధుర్యం అని తెలుసుకున్నా
నా బతుకు బాటలో
నీవు అడుగిడిన వైనం
ఒక అపురూప సుందర కావ్యం
అదే స్నేహ మాధుర్యం మిత్రమా

- శివాని, ఎస్. కోట.
**

అనివార్యం
*
ప్రాణాలు తీస్తుంది కాబట్టి
కరెంటు వద్దనను
కొందరు గల్లంతవుతారని
రోడ్ల వెడల్పు చెయ్యొద్దనను
అభివృద్ధికి అడ్డం పడినప్పుడు
భవంతైనా, గుడిసైనా, గుడైనా
తొలగించాల్సిందే
ఎందుకంటే మా ఊరికి అభివృద్ధి అవసరం
- మాధవీ సనారా. సెల్ : 9440103134.
**
సాహితీ మాతకు సన్మానం
*
అక్షరాలనే మనకిచ్చి
కుదురుగ వాటిని దిద్దించి
సుస్వరాలుగా పలికించి
క్రమపద్ధతిలో నేర్పించిన
జ్ఞాన స్వరూపిణి వీణాపాణికి
ఆ చదువుల తల్లికి సన్మానం
అక్షర ముత్యాలను ఏరి
పద పగడాలనే పేర్చి
వాక్య వజ్రాలను కూర్చి
వివిధములైన సాహితీ
మాలలుగా మార్చి
యతి ప్రాసలు ఛందస్సులతో
అందాలొలికే అలంకారాల
కెంపుల కథలు నీలాల కవితల
పచ్చల వాక్యాల వైఢూర్య వ్యాసాల
గోమేధికాల గీతాలతో
వివిధ ప్రక్రియల వింత శోభల
మరకత మాణిక్య మాలికలల్లి
మన సాహితీ మాతకు వేద్దాము
నవల నాటికల శాలువలతో
స్తోత్ర పాఠాల ఫలములనిచ్చి
సమీక్షల పుష్పగుచ్ఛాలతో
ఆ తల్లిని సన్మానిద్దాము
చేతులు జోడించి మొక్కుదము

- అనే్వషి, సెల్ : 7981327110.
**
నాన్నకు ప్రణామం
*
నాన్న నమ్మకం అమ్మ నిజం
నమ్మక, నిజాల ప్రతిరూపం నేను
కాఠిన్య రూప జనకుడు
అగాథ సంద్ర మణిదీపం
ఆటుపోటుల నౌకను
అదను చూసి నడిపే సరంగు నాన్న
జీవన అనుభవ విలువలు
పంచే జీవన దర్శి నాన్న
కష్టాల కడగండ్ల కవచమై
కాచు కనురెప్పతీరి నాన్న
రుధిరమంత ధారపోసి
దారి చూపించు మార్గదర్శి నాన్న
కఠినమైన సత్యాన్ని నేర్పే
నీతిమార్గ దీపశిఖ నాన్న
వలయు ఓర్పు నేర్పుల వివరించు
కడు నేర్పరి నాన్న
కరకు కత్తిన కఠిన రోగాలు
కరగించు వైద్యుని రీతి నాన్న
పదను ఉలి అంచున
సుందర శిల్పమలచు
శిల్పి రీతి నాన్న
నిర్దయ శిక్షల నిలువరించి
విద్యలు వివరించు గురువు రీతి నాన్న
తాను అలసి సొలసి
నన్ను మనీషిగా మలచిన
నా ప్రియమైన నాన్న
నాకు మార్గదర్శకమై
వెలుగొందు ఆచంద్రార్కము
ఈ విశాల విశ్వానికి
నన్ను పరిచయం చేసిన
అమ్మా నాన్నలకు
మనసా వాచా ప్రణమామ్యహం

- డాక్టర్ దేవులపల్లి పద్మజ,
విశాఖపట్నం.