రాజమండ్రి

స్మృతిలో ఒక శృతి గీతం! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగిన కవన ప్రయాణంతో
ఆ మనీషి జీవన
ప్రాకృతికం, భౌతికంగా విలీనం అనివార్యాలే
మంటల్లా మానవుడిని దర్శించి - సృంచిన
మహాప్రస్థానం యాత్ర కన్నీటి మంటల్లో కన్పిస్తోంది
కర్పూర వసంతరాయునికి - హారతులు, కైమోడ్పులు
ఊరూ వాడా కల్హార మాలికల వైభవోపేతవౌతున్నాయి
పూసిన పగళ్లలో వెనె్నలల్ని - ఊహల గుసగుసల్ని కూడా
ఊసులు ఉయ్యాలలూగించిన పాటల రేడు - నేడు లేడు!
ఏ సామ్యమైనా తన శృతిలోనే ఉంటుందని
ప్రకటించిన ప్రపంచ పదుల సృష్టికర్తా!
అది గజలా, రుబాయినా, కవితా ఖండికా
వ్యాసమా - కాదు విశ్వ మానవ సౌభ్రాతృత్వం
చిరునామాగా మనిషి మట్టి బంధాల్ని స్పృశించినావు
ఒక మహా కావ్యావిష్కర్తగా, విశంభరుడైనావు
కాలం సంపుటాల్లా - కాల నాళికల్లోకి
స్తరించిన తెలుగుతనం మీ పంచెకట్టు ప్రతిక్షిప్తమైపోయింది!
చరణ కింకిణుల గలగలారావాలు
యిక అమరలోకపు నాట్యమయూరాల్ని
లకోయలుగా మాచల్దేవొలుగా
చూసుకుంటారేమో లెండి
యిక మీ నయనాలు పలికించే బాసలు
అధర దరహాసాల లాస్యాలు
మా మనో నేత్రాంచలాల్లోనే దర్శించుకుంటాం
మృత్యువు సకల సౌందర్య రూపం మిమ్ములను
కాలధర్మంగా తన వైపుకు లాగేసుకుంది
మీ చరణాలు - పల్లవులు శబ్దిస్తూనేవుంటాయి
మీరందించిన శృతిని సరిసమంగా అమరగీతాలుగా
మేం పాడుకుంటూనే వుంటాం!

- విఎస్‌ఆర్‌ఎస్ సోమయాజులు, 944114815
**

తండ్రి తలంపుల్లో..
*
నీ మాట వౌనం అయింది
మరణం ఇచ్చిన తీర్పు అది
అంతే తప్ప నిన్ను మరువలేదు
నీ తలంపు మాలో మూగపోలేదు
నిత్యం మా జ్ఞాపకాల్లో
నిన్ను నెమరు వేసుకునే ఉంటాం
హృదయ కవాటాలు తెరచిన గది మాది
ఆప్యాయంగా పిలుచుకున్న
మా నాన్న పిలుపును
మనసులో అదుముకొన్నాం, కాబట్టే
వాకిట బయట నిలబెట్టం
నరనరాల్లో నింపుకున్నాం
నీ ప్రేమను, ఆప్యాయతను,
అందుకే మరువం నిన్ను,
నాన్న మధుర వచనమే కాదు
ఆకట్టుకున్న మాధుర్య కావ్యం,
అవసరతల్లో ఉన్న నాన్న లోటేమిటో
తెలుస్తుంది ఇప్పుడిప్పుడే,
నాన్నొక కలల కావ్యం
ఊహల్ని ఒదిలేసిన చిహ్నం
అయినా, గుర్తుకొస్తే చాలు
అవుతాడు మదికి చైతన్య తరంగం.
నీవెలా సాకావో మమ్మల్ని తెలియదు
నీ బాసటతో కలియదున్నాం
మమ్మల్ని తీర్చి దిద్దుకున్నాం
మాలో నిన్ను నిలుపుకున్నాం

- రవికాంత్
**

మంచుకింద చిగురు
*
చిగురించే చిగురు
మంచు చల్లదనానికి
ఆకలిలా గడ్డ కడుతుంది
చడీచప్పుడు లేని ఉదయంలా
చలికోతతో
గాలి కొత్త ముసుగు ధరించి
కొత్త పెళ్లికూతురిలా
యవ్వన వెలుగులు చిమ్ముతోంది
పున్నమి వెనె్నలలో
చలి దృశ్యాలకు
కోరికలు జ్ఞాపకంలా
మేఘాల అద్దాలతో
కాలం అందం చూసుకుంటోంది
హృదయం నిండా
చలి వెలుతురు చినుకులే
గదిలో
కౌగలింతల శబ్దం అలల కలలో
తడి తెల్లారింది
తలుపు తీశాను నిశ్శబ్దంగా
చీకటి కోడి కూసింది
చలి గాయాలు కనిపించకుండా
మంచు సీతాకోకలా
గుండెపై వాలింది
చిగురు వెలుగులా...
- నల్లా నరసింహమూర్తి,
కురసాల వీధి, అమలాపురం - 533201
**
జల సుగంధం
*
ఉదయ గోదావరి అందం
ఉప్పొంగే జీవ తరంగం
లేలేత భానుడి కిరణాలతో
స్వర్ణ రంజింతం
శుభోదయానికి సంరంభం
తెరచాప పడవ వయ్యారాల నాట్యం
గోదావరి విహంగాల గాన రవళి
కోటిలింగాలకు అంకితం
వలకు చిక్కని మీనాల కేరింతలు
జల సుగంధం
మనసులకు బంధం
ఆదిత్యుని ఆధ్యాత్మిక పరిమళం
భక్త జనావళికి పరవశం
పవిత్ర నదీమతల్లి చరితం
నిత్య హారతుల కదంబం
రాజమహేంద్రికి రాజసం
మార్కండేయుని జయం
మనందరికి అభయం
కావాలి నిత్యనూతన జీవం
- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం, చరవాణి: 9491171327