విశాఖపట్నం

నానీల తరవాణి ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేడు నుండి ఇరవై నాలుగు అక్షరాల మధ్య ఒక అర్ధవంతమైన భావచిత్రాన్ని అందించేది నానీ. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు అక్షరాలతో ఆహా అనిపించేటట్లు రత్నాల బాలకృష్ణ తన తరవాణి నానీల సంపుటి ద్వారా జీవిత సత్యాన్ని చెప్పారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే నానీలకు నారు నీరు పోసిన డాక్టర్ గోపి బాలకృష్ణ నానీలు చదవగానే పువ్వుల పొట్లం విప్పినప్పుడు గుప్పుమనే పరిమళంలా అనిపించింది అన్నారు. ఇలా అనడానికి కారణం ఈ నానీయేమో. ‘మెరుపు కొరడాతో/ ఆకాశానికి శిక్ష/వర్షమై/కన్నీరు కారుస్తోంది. మెరుపును కొరడాతో పోల్చి అది ఆకాశాన్ని శిక్షిస్తే ఇంకేముంది ఆ బాధ తాళలేక ఆకాశం ఏడుస్తోంది. అదే వర్షం. సుమారు 120 నానీలు ఉన్నాయి ఈ సంపుటిలో. అన్నీ దేనికవే సాటి, సమీక్షించాల్సి వస్తే. కరిగి వెలుగుతుంది/ కొవ్వొత్తి/ పెరిగి వికసిస్తుంది విత్తు.
పై రెండూ తమ స్వార్ధం లేకుండా ఇతరులకు మేలు చేసేవే. మనిషి వాటిలా ఇతరులకు సాయం చేయాలనేది కవి భావన. అలాగే మరో నానీలో మనిషి స్వభావాన్ని చక్కగా చెబుతాడు కవి. ఎండ మింగి/ నీడనిస్తుంది వృక్షం/ ఆ నీడన నిలిచి కూలదోస్తాడు మనిషి. నేటి మానవ నైజాన్ని కేవలం 25 అక్షరాల్లో అద్దంలా చూపించారు. చెట్టు ఎండను మింగినా మనకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. కానీ మనిషి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాడిలా ఆ నీడలో సేదదీరుతూనే గొడ్డలితో చెట్టునే నరికేస్తున్నాడు. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం, పర్యావరణ సమస్యలూను.
ఇకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల నీటి వివాదంపై చిన్న నానీ చదవండి.
నీరు నిప్పుగా మారింది/రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి అని కవి అంటారు. అంటే నీటిని నిప్పు (ఘర్షణ)గా మార్చేది అక్షరమే అని నిరూపించడం అమోఘం.

- ఈవేమన, సెల్ : 7893451307