రాజమండ్రి

పెత్తనం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లలిత బంధువులింట రాత్రి జరిగే పెళ్లికి రామచంద్రపురం వచ్చింది. వివాహం అయ్యేసరికి తెల్లవారింది. తర్వాత కాలకృత్యాలు ముగించుకుని స్నానం చేసింది. కాఫీ ఫలహారాలు సేవించాక పెళ్లివారి వద్ద శెలవు తీసుకుని ఆటోలో తెలిసిన వారంటికి వెళ్లి అక్కడ ఒక గంట గడిపింది. తర్వాత ఆ ఇంటి కోడలికి చెప్పి నడిచి పాత బస్టాండ్‌కు వచ్చి బయలుదేరబోతున్న కాకినాడ బస్సెక్కింది.
రాత్రి పెళ్లిలో చాలామంది చాలా ఆప్యాయంగా అభిమానంతో మాట్లాడారు లలితతో.
లలిత సామాన్య గృహిణి. ఒంటరి మనస్తత్వం గలదికాదు. పది మందితో కలుపుగోరుతనంగా ఉంటుంది. సమస్య ఎవరిదైనా తనకు తెలిస్తే కల్పించుకుని తప్పొప్పులు చెప్పి పరిష్కారానికి పూనుకుంటుంది. సమస్యని ఆదిలోనే తుంచడం మంచిదనుకుంటుంది.
ఒక పని కోసం వెడితే పది పనులు చక్కబెట్టుకొస్తుంటుంది!
లలిత చిన్ననాటి స్నేహితురాలు అరుణ కాకినాడలో వుంది. ఆమెని చూడ్డానికని వస్తున్నది.
గంట తర్వాత జిల్లా పరిషత్ కూడలిలో బస్సు దిగిన లలిత ఆటోలో గాంధీనగరం అరుణ ఇంటికి వచ్చింది. అరుణ భర్త క్యాంపులో ఉన్నాడు.
‘చాలా ఏళ్లయింది మనం ప్రత్యక్ష్యంగా కలిసి మాట్లాడుకుని’ అంటూ స్నేహితురాళ్లు ఆప్యాయంగా హత్తుకుపోయి స్నేహసుధని చాలాసేపు అనుభవించారు. తర్వాత హాల్లో కూర్చుని కాఫీ తాగారు. తర్వాత పిచ్చాపాటి మొదలుపెట్టారు. అందులో రాని విషయమంటూ లేదు.
మధ్యలో హఠాత్తుగా లలిత ‘మీ అత్తగారేరి?’ అనడిగింది.
ఇంతసేపు ఆ ఊసుకోసం వేచివున్న అరుణ మొహం మార్చుకుని చిరాకుతో ‘ఇంకా పోలేదమ్మా నిక్షేపంగా గుండ్రాయిలా ఉంది. అరవ చాకిరీ చేయలేక చచ్చిపోతున్నాను అంటే నమ్ము. అ అంటే కోపం ఉ అంటే కోపం తెగ సాధిస్తుందనుకో! చచ్చిపోతున్నాననుకో? చచ్చినా బాగుండును ఈ బాధ తప్పును... ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టదు. వళ్లు అలిసి పోనివ్వదు. వేళకి మాత్రం ఠంచునుగా మింగుతుంది. తిండికి తిమ్మమ్మ పనికి పోతమ్మ అనుకో. ఆవిడ ఓనరు నేను సర్వెంట్‌ని. ఈ దరిద్రం నాకు ఎప్పుడు వదుల్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నానంటే నమ్ము...’ అంటూ ఆగి కళ్లు తుడుచుకుని మరలా ‘... పెద్దలు ఒకరి అదృష్టం వెరొకరికి రాదన్నట్టు మా వదిన చాలా అదృష్టవంతురాలు. మా అమ్మ అన్నయ్య వద్ద ఉంటున్న సంగతి నీకు తెలుసుగా... మా అమ్మ కోడలిని మా వదిన్ని చిన్నమెత్తు పనిచేయనివ్వదు. ఇంటి పని వంట పని మొత్తం మా అమ్మే చేసుకుపోతుంది. మా వదిన కాలుమీద కాలేసుకుని మహారాణిలా దర్జాగా కూర్చుంటుందంటే నమ్ము. మా వదిన అదృష్టమే అదృష్టం ఎవరికీ పట్టదు’ అంటూ ముక్తాయింపుగా ‘మీ అత్తగారి సంగతి చెప్పు’ అంది. లలిత కూడా అత్తగారి ఆరళ్లు పడుతూ ఉండి ఉంటుంది అనుకుంది. అందుకే ఆసక్తిగా చూసింది.
‘నేను మా అత్తగారు తల్లికూతుళ్లా ఉంటాము. పెద్దరికం పెత్తనం జీవితానుభవం రీత్యా మా అత్త వహిస్తారు. అది సాంప్రదాయం. నాకిష్టం. నేను మా అత్తమ్మను చూసి నేర్చుకుంటుంటాను. నువ్వు నమ్మక పో’ అంది లలిత నవ్వుతూ దృఢంగా.
లలిత చెప్పిందానికి అరుణ మొహం చిన్నబోయింది. మంచి మాట కెపాసిటీ అది! అందుకే

‘అవును నీమాట కుండబద్దలు కొట్టినట్టు ఉంటుంది’ అని అంగీకరించింది అరుణ.
‘అవునా! అయితే మన స్నేహ రీత్యా నేను చెబుతున్నది అర్ధం చేసుకుంటావు అని తోస్తున్నాను. నాకున్నట్టువంటి ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు ప్రకారం మీ వదినగారికి ఉన్న అత్తగారి ఆరళ్లు బాధలు నీకు లేవు. అక్కడ మీ అమ్మ కోడలిని రాచి రంపానా పెడుతుంటే ఇక్కడ నువ్వు మీ అత్తగారిని పెడుతున్నావు. సంసారంలో కలతలు రాకూడదని పరువు ప్రతిష్ఠలు పోకూడదని ఇక్కడ మీ అత్త అక్కడ మీ వదిన నోరుమెదపడం లేదు. ఒరుగేసుకుపోతున్నారు! మీ అమ్మ పెద్దరికం కోసం నువ్వు పెత్తనం కోసం వెంపర్లాడిపోతున్నారు.
నువ్వు మీ అత్తగారిని నోటికొచ్చినట్టు అన్యాపదేశంగా మాట్లాడి మానసికంగా హింసిస్తున్నావు. ఉన్నదీ, లేనిదీ కల్పించి అల్లేసి చిలవలు పలవలుగా కల్లబొల్లిగా మాట్లాడి ఇతరుల దగ్గర మీ అమ్మకి నీకు సానుభూతి సంపాదించుకుంటున్నావు. మీ అత్తగారు నిన్ను తట్టుకోలేక దేవుడా త్వరగా తీసుకుపోగా తండ్రి అని అదృశ్యంగా ఏడుస్తూ వేడుకుంటున్నది. అక్కడ మీ వదిన దుస్థితి అలాగే వుంది. ఈ ఘోష ఉసురు మీకు మంచిదికాదు. ఇద్దరు ఒక తల్లీ కూతుళ్ల వల్ల జీవితంపై విరక్తి చెందారంటే దేవుడు క్షమించడు. అన్ని రోజులు మనవికావు. మారుతున్నాయి. కోడళ్లు కూతుళ్లు అత్తలవుతారు ఒక నాటికి. అప్పుడు నీకు తనదాకా వస్తేగానీ తెలీదన్నుట్టు అర్ధమవుతుంది. నిన్ను బట్టి మీ అమ్మకి తెలిసి వస్తుంది. అత్తలో మాతృమూర్తిని దర్శించుకుంటే అత్తమ్మ అవుతుంది. కోడలిలో కుమార్తెని చూసుకుంటే కన్న కూతురవుతుంది.
రాంపురం రాత్రి పెళ్లికి వచ్చి ఉదయం మీ అన్నయ్యగారింటికి వెళ్లే సరికి మీ అమ్మగారు గుడికి మీ అన్న బయటకు వెళ్లినట్టు మీ వదిన చెప్పింది. తదుపరి సన్నిహిత పరిచయంతో మీ వదినగారితో సంభాషించాను. అడగ్గా అడగ్గా మీ అమ్మ దాష్టికం బయటపెట్టింది. తర్వాత మీ అమ్మగారు వచ్చాక ఆమెకి చెప్పేలా చెప్పాను. ఆమె ఆలోచనలో పడింది. అరుణా! నీకు అలాగే చెప్పాను. ఏ సమస్యనైనా తెగేవరకు లాగితే తెగిపోతుంది. తెగితే అతకదు. తర్వాత నీ ఇష్టం ‘సుతిమెత్తగా సమయస్ఫూర్తిగా చెప్పేసరికి తలకెక్కిన అరుణ తన గుట్టు రట్టయినందుకు తలదించుకుంది. లలిత పెళ్లికిందుకే వచ్చిందనుకుంది.
తర్వాత తలెత్తి లోపలికి వచ్చిన అత్తగారికి ముందు అరుణ తర్వాత లలిత పాదాభివందనం గావించారు. పిల్లలిని పెద్దామె ఆశీర్వదించింది.
అక్కడ అరుణ అమ్మ తన కోడలిని కూతురులా హత్తుకుంది
లలిత ప్రయాణం విజయవంతమైంది.

- కృష్ణ మాధవరపు
కాకినాడ, సెల్: 8589492283

- కృష్ణ మాధవరపు