నెల్లూరు

పుష్కర స్నానం..బాగుంది (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో కృష్ణ పుష్కరాల సందర్భంగా ప్రచురించిన పుష్కర స్నానం..అనంత పుణ్యఫలం బాగుంది. పుష్కరాల గురించి చాలా తెలియని విషయాలను విపులంగా వివరించినందుకు విష్ణుబొట్ల రామకృష్ణ గారికి ధన్యవాదములు. అసలు పుష్కరస్నానం ఎలా చేయాలి, ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది, ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి అంటూ వర్ణించిన తీరు బాగుంది. మంచి విషయాలను పాఠకులకు అందించిన విష్ణుబొట్ల గారికి ధన్యవాదములు.
- రావి పద్మజ, తిరుపతి
- అనంతబొట్ల సుబ్బారావు, కందుకూరు
- సజ్జా హైమావతి, గూడూరు

మైత్రి దినోత్సవ కవితలన్నీ బాగున్నాయి
గత వారం మెరుపులో ప్రచురించిన కవితలన్నీ బాగున్నాయి. స్నేహం అంటూ మొదట్లో ప్రచురించిన వేదం సూర్యప్రకాశం గారి కవిత చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా మిత్రుడు అంటే ఎలాంటి వాడు, ఆ పదానికి ఎవరు అర్హుడో తెలిసే విధంగా కవిత సాగింది. అలాగే ములుగు లక్ష్మీమైథిలీ గారు రాసిన మధురమైన స్నేహంలో వర్గాలు, వర్ణాలు వీడితేనే స్నేహం అంటూ బాగా రాశారు. చిన్నచిన్న పదాలతో గొప్ప భావాన్ని ఉటంకించారు. గోవిందరాజు సుభద్రాదేవి గారు రాసిన కాంతిపుంజం కవిత కూడా బాగుంది. మోపూరు పెంచల నరసింహం గారు రాసిన స్నేహదీపం కవితలో స్నేహానికి నువ్వే ఊపిరి..స్నేహమే నాకున్న సిరి అనే వాక్యం అద్భుతంగా వుంది. ఇలా మెరుపులో మైత్రీదినోత్సవ కవితలన్నీ దేనికవే పోటీపడి మెరిశాయి.
- నరసింహారావు, పిచ్చిరెడ్డితోపు, నాయుడుపేట
- వెనె్నలకంటి సులోచనమ్మ, ,నెల్లూరు
- సృజన్‌కుమార్, అంజయ్యరోడ్డు, ఒంగోలు

***
రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

***
పుష్కర కవిత

పుష్కర పూజలందుకో..
కోటితీర్థాల కృష్ణమ్మా
కోటి దేవతల ఆరాధ్యదైవమా
నీలిరంగు కెరటాలతో
నిత్య ప్రవాహంతో
ఇంద్రకీలాద్రి సొగసులతో
అభినవ అమరావతి సోయగాలతో
పరుగుపరుగున వచ్చి
గ్రామీణులను పలకరించి
కళకళలాడే పల్లెలకు,
పచ్చనిపంట పొలాలకు
నీ దివ్యజలాలను అందిస్తూ
నాగార్జుని బోధనలకు పరవశించి
అన్నపూర్ణగా పసిడి పంటలనిచ్చి
గలగల ప్రవహించే కృష్ణమ్మా
పుష్కర పూజలందుకో..

సంస్కృతి, సాంప్రదాయాలకు
సాక్షీభూతం నీవమ్మా..
జాలువారే జానపదులకు
కూచిపూడి నృత్యాలకు, నీవే ప్రేరణమమ్మా
కోట్లాది జంతుజలాలకు,
ప్రాణదాతవి నీవమ్మా
తీర్థాలను, క్షేత్రాలను పావనం చేస్తూ,
తెలుగువారి జీవితాల్లో వెలుగులు నింపుతూ
మహారాష్టల్రో పుట్టి ఎందరో మతాచార్యులకు, భక్తులకు అలవాలమై
తెలుగు రాష్ట్రాలలో అడుగిడి
శ్రీశైల మల్లన్నకు మొక్కి
కనక దుర్గమ్మను కలిసి
గలగల చప్పుళ్లతో, బీరబీరమంటూ
హంసల దీవిలో అంతర్ధానమయ్యే
నదీమ తల్లి కృష్ణవేణీ
పుష్కర పూజలందుకో..!

- టివిఎంఎల్ ప్రకాష్‌రావు
టీచర్, కావలి, చరవాణి : 9490662460