నెల్లూరు

ఒంటరి పక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదీ...
అలనాటి మేటి సఖ్యతారాగం
అసమాన త్యాగం
మూగబోయినదా!
ఏది..
జాతి కోసం.. నీతి కోసం
సర్వజనుల సౌభ్రాతృత్వం కోసం
కంకణబద్ధుడయిన మహనీయుడేడి?
ఎక్కడా?
పేదవాడి ఆకలితీర్చి
నేనున్నానని అక్కున జేర్చి
చేయూతనిచ్చే మనసున్న మనిషేడి?
మానవత మాయమవుతున్న వేళ
మనిషి మనిషికీ మధ్యన
ద్వేషపు తెరలు కోటగోడల్లా నిలిచి
నిర్వేదపు సేద్యం స్వేద బిందువును మింగేస్తుంటే
గాయపడిన హృదయాలు
దుఃఖసాగరంలో
గమ్యం లేని సుడిగుండాలవుతున్నాయి
నిన్నటి వేదన రేపటికి ఆవేదనగా మిగిలినట్లు
నేటి సంతోషం పచ్చి అపద్ధమయింది
నీళ్లూ కన్నీళ్లూ ఖరీదైన వస్తువులయ్యాక
కన్నవారి శవం దగ్గర ఏడుపుకూడా
నాకేమొస్తొందని ప్రశ్నిస్తున్నది
జాలి లేని జీవితాలు
బతుకు విపణి వీధిలో సరుకయ్యాక
వెనె్నల చల్లదనాలకూ
కమ్మనికాంతివనాలకూ చోటెక్కడుంది?
ప్రతి మనిషీ నిరంతర రోగగ్రస్తుడే
పురిటినాడే బాల్యం పారిపోయింది...
కౌమరమొచ్చి..
నీ ఆశల కాణాచిలో రోదిస్తుంటే
యవ్వనమిప్పుడు సెల్ సెగలతో..
చాటింగులు, చీటింగులు ఆటలాడుతోంది
వృద్ధాప్యం ముంచుకొచ్చి
మరణకేదారం కోసం పరితపిస్తోంది
ఇంకెక్కడి జీవిత పరిమళం?
ఎక్కడుందీ? బతుకు పరిపూర్ణత
జీవితమిప్పుడు జనారణ్యంలో ఒంటరి పక్షి
ఇప్పుడు.. ఇప్పుడూ..
మనిషిని మనిషిగాగౌరవించడం నేర్వాలి
నేను మనిషన్న నిజాన్ని
చాటుకోవాలందరం!

- డా॥ నెమిలేటి, తిరుపతి
చరవాణి : 9490182636
--

ఇది నీకు తగదు

అబ్బ ఎంతందంగా ఉన్నావు
నీకోసం ఊహ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా
ఐదేళ్ళు పూర్తయ్యా అవ్వంగానే నీ దగ్గరకు పరిగెత్తికొనివచ్చా
యవ్వనం రాగానే నువ్వు తప్ప వేరు ధ్యాస లేకుండా చేశావు
నిన్ను ఎప్పుడెప్పుడు నాలో కలుపుకుంటానా అనే ఆరాటం
ఆ తొందరలోనే ఉత్సుకత నిన్ను త్వరగా నాలోకి చేర్చుకునేందుకు సహాయపడింది
నీ చేపుపడిన వాళ్ళను కుబేరుల్ని చేస్తావు
నీ మీద ధ్యాసుంటే ధనవంతుల్ని చేస్తావు
నువ్వే తక్కువదానివా నిన్ను అమితంగా ఇష్టపడ్డ వాళ్ళను పిచ్చివాళ్ళను చేసిన ఘనురాలివి
పైగా ఎంతమందికి పంచినా తరగని నిధిని నీలో నిక్షిప్తం చేసుకున్నావు
ఇక ఎంతటి వారైనా నీకు దాసుడు కాకుండా ఎలా ఉంటాడు
కొందరివైపు అలలు కనె్నత్తయినా చూడవు ఏమిటి నీమాయ
ఒక్కోసారి తొందరగా పట్టుబడతావు
ఇంకోసారి ఎంత గింజుకుకి తలబద్దలు కొట్టుకున్నా రాను పొమ్మంటావు
నీ చేతిలో కీలుబొమ్మలా ఆడిస్తావు
ఇది నీకు న్యాయమేనా? ఎంతటి జానమున్నా పుస్తకానివైతే మాత్రం ఇది నీకు తగదు సుమా.
- దువ్వూరు సుమలతా సురేష్
జిల్లా ప్రజా పరిషత్ - నెల్లూరు
చరవాణి - 9494799248
--

మినీ కవితలు

కాంతిరేఖ
కారు చీకట్లో కాంతిరేఖ!
మిణుగురు పురుగు.

కంటికాటుక
ఆమె కంటి కాటుక జారి చీకటయ్యింది
ఆమె చిరునవ్వు విరిసి వెలుగై మెరిసింది

అద్భుత నటన
ఆమె కళ్లు వర్షిస్తున్నాయి
గ్లిజరిన్‌ను కన్నీళ్లుగా!
అద్భుత నటన!!

కారు చీకటి
కారు చీకటిలోన
డ్రైవర్‌పాట్లు
బ్యాటరీ పాడయింది!

- జి.విజయకుమార్, రీడ్స్‌పేట, చిత్తూరు
--

కొత్త ఆపద

ఏదో జరుగుతుంది
మట్టిని రైతుకు దూరం చేసే మాయ..!
ఏదో దుర్మార్గం..చాప కింద నీరులా..!
ఓ పక్క మబ్బు విడువని నీరు
కన్నీరు పెట్టిస్తుంది.
పంపుసెట్టు కోసం
అసెట్టు మొత్తం
తాకట్టు పెట్టినా దిగులు ముఖం
కనిపించేదెవరికి?
పొలం దారినిండా ముళ్లులే
కాలికి గుచ్చుకుంటూ..
విత్తనాల రూపంలో
పురుగు మందుల రూపంలో..
పంట ధర..గిట్టుబాటుకు
ఒక మెట్టైనా ఎక్కని స్థితి.
బాంకు రుణం..
రణమై సల్పుతుందో పక్క
ఇన్ని సుడిగుండాల మధ్య
జీవనశ్వాస మూలుగుతున్నా..
మట్టి బంధాన్ని తెంపుకొని
తెంపరితనానికి..
ఇప్పుడు కొత్తగా
రకరకాల పేర్లతో ఆపదొచ్చింది.
నోరు లేని రైతుకు
నోరు తిరగని పేర్లతో
మట్టిని దక్కనివ్వని చదరంగం
అభివృద్ధి పేరున..యంత్రాలు
చావు మంత్రాలు పల్కుతున్న ధ్వని
వస్తువులు..కోర్కెలు తీర్చొచ్చేమా..!
కానీ ఇంత ముద్ద
గొంతులోకి జారితేనే కదా
జీవన పరిమళం వికసించేది..!

- అవ్వారు శ్రీ్ధర్‌బాబు
చరవాణి : 8500130770
--

కొత్త ఆపద

ఏదో జరుగుతుంది
మట్టిని రైతుకు దూరం చేసే మాయ..!
ఏదో దుర్మార్గం..చాప కింద నీరులా..!
ఓ పక్క మబ్బు విడువని నీరు
కన్నీరు పెట్టిస్తుంది.
పంపుసెట్టు కోసం అసెట్టు మొత్తం
తాకట్టు పెట్టినా దిగులు ముఖం
కనిపించేదెవరికి?
పొలం దారినిండా ముళ్లులే
కాలికి గుచ్చుకుంటూ..
విత్తనాల రూపంలో
పురుగు మందుల రూపంలో..
పంట ధర.. గిట్టుబాటుకు
ఒక మెట్టైనా ఎక్కని స్థితి.
బాంకు రుణం..
రణమై సల్పుతుందో పక్క
ఇన్ని సుడిగుండాల మధ్య
జీవనశ్వాస మూలుగుతున్నా..
మట్టి బంధాన్ని తెంపుకొని
తెంపరితనానికి.. ఇప్పుడు కొత్తగా
రకరకాల పేర్లతో ఆపదొచ్చింది.
నోరు లేని రైతుకు
నోరు తిరగని పేర్లతో
మట్టిని దక్కనివ్వని చదరంగం
అభివృద్ధి పేరున..యంత్రాలు
చావు మంత్రాలు పల్కుతున్న ధ్వని
వస్తువులు.. కోర్కెలు తీర్చొచ్చేమా..!
కానీ ఇంత ముద్ద
గొంతులోకి జారితేనే కదా
జీవన పరిమళం వికసించేది..!
- అవ్వారు శ్రీ్ధర్‌బాబు
చరవాణి : 8500130770

--

ఇసకేరా అన్నింటికి మూలం

ఇసకేగా అన్నిటికి మూలం
ఆ ఇసకలేనిదే నిర్మాణాలు శూన్యం
ఇసకను సులువుగా చూడకురా
ట్రక్కు ట్రక్కు ఇసకను కుప్పలు చేయరా
కుప్ప చేసి డబ్బులు కూడబెట్టరా
ఇసక రాశులున్నప్పుడే లక్షలు చేకూరునూ
అందుకే ఇసక విలువ తెలుసుకొని నడవరా!

వాగైనా వంకైనా ఓకేరా
కాలువైనా నదియైనా ఫరవాలేదురా
డ్యాములైనా, చెక్‌డ్యాములైనా సరేలేరా
కాలుష్యం గొడవ మనకొద్దురా
ఎవరెటు పోయినా మనకెందుకురా
వీలైతే సీనరేజ్‌లు ఎగరెయ్యరా
వీలైనంత స్విస్ బ్యాంకులో నిల్వచేయరా!
ఏదైనా ఏమైనా చేసి నీవు లీజు పట్టురా
లీజు రాకున్న రాజకీయం రగిలించుమురా
ఎవరైనా ఎదురొచ్చిన లెక్క చేయకుమురా
ధైర్యముతో తెగ దోపిడి చేయమురా
దోచేసి పెద్దమనిషిగా చలామణి కమ్మురా!

ఎల్లప్పుడు పదవిలో ఉంటేటట్లు చూసుకోరా
అది లేనప్పుడు
మన వారెవరైనా వుండేటట్లు చేసుకోరా
ఇసకే కదా అని నిర్లక్ష్యం చేయబోకురా
సోమరిగా నీవు నీ పనులు
పరులకప్పగించకురా
ఎంత నమ్మితే అంత మంచిదని నటించుమురా
అనవసరంగా అందరిని నమ్మవద్దురా
అడుగడుగున
సొంత లాభము చూసుకొమ్మురా
నమ్మకంగా నీ పనులు చక్కపెట్టుకొమ్మురా
లక్షలక్షలు కూడబెట్టిననాడే
జనం నిను గౌరవించురా
అది లేనప్పుడు నీవు గుడ్డికాసుకు లెక్కకాదురా
ఇసక ఉచితమనేది ఒక నాటకమురా
అధికారులు తనవారిని కాపాడే కపటనీతిరా!

ఉచితముగా ఏ వస్తువు వస్తుందిరా
కరెంటా? నీరా? తిండా? బట్టా? నీడా?
నిత్యావసర వస్తువులా?
ఏది ఉచిత వస్తువురా?
సరసమగు ధరకు వస్తువస్తే అది చాలురా
అన్నింటిని సామాన్యులు కొనక తప్పదురా
కొని స్థిమితంగా జీవించుమురా..!
- లక్కరాజు శ్రీనివాసరావు. అద్దంకి
చరవాణి : 9849166951

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net