విశాఖపట్నం

అందమైన ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమిటి నాన్నా ఎప్పుడూ ఇలానే అంటావు’’ అంటూ చికాగ్గా తన గదిలోకి వెళ్లిపోయింది సృజన.
‘‘ఏమైందండీ! అదలా కోపంగా వెళ్లిపోతుంది. ఏమైనా అన్నారా?’’ అంటూ శ్రీనివాస్‌ను అడిగింది కాఫీ తీసుకు వస్తున్న లక్ష్మీకాంతం.
‘‘ఏమీ లేదు కాంతం. ఇదెప్పుడూ ఉండేదే. స్కూటీ కొనమంటే కొనలేదుగా. ఇంకా ఇల్లు మరీ ఇంత చిన్నదిగా కట్టిస్తే ఎలా అని సృజన గోల. తన సైకిల్ పోయిందట. చూడ్డానికేమీ బాగోలేదట. స్కూటీ కొనమంటూ మొదలుపెట్టి ఇంటి గురించి మాట్లాడింది. వచ్చే కొద్దిపాటి డబ్బులతో మూడుపూటలు తిని బతకడమే కష్టంగా ఉంది. ఈ చిన్న కొంప అయినా ఆనాడు కట్టుకున్నాం గనుక సరిపోయింది. ఈనాడు కట్టాలంటే మన తరమా చెప్పు?’’ అన్నాడు శ్రీనివాస్.
‘‘అదీ నిజమే కానీ నలుగురి ముందు హోదాగా ఉండాలంటే ఒక అందమైన ఇల్లు ఉండాలి కదండీ. మన ఊరిలో ఉండే శ్యామలమ్మగారు మొన్న గృహప్రవేశానికి పిలిచారు. రంగు రంగుల గోడలు, అద్దాల మేడలు, మార్బుల్ ఫ్లోరింగ్ ఇలా ఎన్ని హంగులో తెలుసా? అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలి. ఆరేడు అంతస్తులు కాదు కదా ఆరు సెంట్ల ఇల్లు కూడా లేదు మనకి. విధి రాత’’ అంటూ నిట్టూర్చింది కాంతం.
‘‘కాంతం శాంతం అంత అందంగా ఇల్లు కట్టుకున్నా శ్యామల పిన్నికి, బాబాయికి పడదు కదా. అంత పెద్ద ఇల్లు వారి మనసులను మరింత దూరం చేస్తుంది. అందం ఇళ్లలోనో, మనం ధరించే అందమైన దుస్తుల్లోనో లేదు. మన వ్యక్తిత్వంలో ఉంటుంది. నవ్వుతూ బతికే మన హృదయాలలో ఉంటుంది. అందమైన ఇల్లంటే పెద్ద ఇల్లు మాత్రమే కాదు. ఆప్యాయతలకు అపరూపమైన ప్రదేశం. అది మన ఇంటిలా. ఆరంతస్తులు కాదు కదా అరవై అంతస్తులున్నా మనిషి పడుకునేది కేవలం ఆరడుగుల స్థలంలోనే. నిల్చునేది ఒక్క అడుగు స్థలంలో మాత్రమే. ఎన్ని కోట్లున్నా నా కాంతం శాంతంగా చిరునవ్వు చిందిస్తూ అందంగా కనిపిస్తారా చెప్పు ఏమంటావు?’’ అన్నాడు శ్రీనివాస్.
‘‘చాల్లెండి’’ అంటూ కాఫీ కప్పు తీసుకుని వెళ్లిపోయింది కాంతం.
‘‘అమ్మా! నా బ్లూగాగ్రా ఏదీ?’’ అంటూ అరిచింది సృజన.
‘‘చాకలికి వేశాం కదా! ఇంకేదైనా వేసుకోమ్మా’’ అంది కాంతం.
‘‘ ఉన్నాయిలే డొక్కు డ్రస్సులు. ఏవీ బాలేవు. ఆ గాగ్రా కూడా బాగోలేదు. కానీ గుడ్డి కన్నా మెల్ల మిన్న కదా. తెచ్చుకుంటానులే’’ అంటూ చిర్రుబుర్రులాడుతూ బయలుదేరింది సృజన.
‘‘ఇల్లు తెలుసా నీకు’’ అని అడుగుతున్న కాంతం మాట పూర్తవ్వకుండానే ‘‘తెలుసుకుంటానులే’’ అంటూ చిరాగ్గా బదులిచ్చింది సృజన.
‘‘సైకిల్ మీద వెళ్లమ్మా’’ అంది కాంతం.
‘‘తెలుసులే! లేకుంటే కారో, విమానమో తెస్తారా ఏమిటీ?’’ అంది సృజన.
అలా కోపంగా సైకిల్ తొక్కుతున్న సృజన దారిలో ఒక వ్యక్తి ఎదురయ్యాడు.
‘‘బాబాయ్‌గారూ! ఇక్కడ చాకలి రమణమ్మ ఇల్లెక్కడ’’ అడిగింది సృజన.
దూరంగా ఉన్న ఒక పెంకిటింటి వైపు చూపించాడను.
అదొక చిన్న పెంకుటిల్లు.
అటు చూసిన సృజన ‘మా వంట గదంతా కూడా లేదిది. ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉంటారబ్బా?’ అనుకుంది సృజన.
ఆమె ఆ ఇంటి దగ్గరకి వెళ్లగానే ‘‘అక్కా! నీ సైకిలు బాగుంది’’ అంటూ సరదాగా బెల్ మోగించాడు ఒక చిన్న పిల్లాడు.
ఆ మాట వినగానే ఏదో తెలియని భావన. దాంతో పాటు ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి.
తనకు నచ్చని సైకిల్‌ని పొగిడేవారు కూడా ఉన్నారా అనుకుంది.
‘‘ ఇక్కడ రమణమ్మ ఉంటారా?’’ అని అడిగింద.
‘‘అక్కా! ఒక్క నిముషం’’ అంటూ శరవేగంగా పరిగెత్తాడు ఆ పిల్లాడు. కొద్దిసేపటికి వచ్చింది రమణమ్మ.
‘‘అయిదు నిముషాలమ్మా! మీ బట్టలు ఇచ్చేస్తాను కూర్చోండి’’ అంటూ కుర్చీ ఇవ్వబోయింది రమణమ్మ.
‘వద్దు’ అన్నట్లు సైగ చేసింది సృజన.
ఉన్నట్లుండి ఆమె దృష్టి వరండాలోకి మళ్లింది.
అక్కడ సగం చిరిగిన తెల్లగౌను వేసుకుని ఒక చిన్నపాప పేపర్ కటింగ్ అంటిస్తోంది.
‘‘నేను అంటించనా?’’ అంటూ చొరవ తీసుకుంది సృజన.
అలా అంటిస్తుండగా కలాం ఆస్తి అన్న హెడ్డింగ్ కనిపించింది.
ఆసక్తిగా చదివింది. అందులో కలాంకు మూడు ప్యాంట్లు, ఆరు చొక్కాలు, మూడు సూట్లు, ఒక వాచీ, రెండువేల అయిదు వందల పుస్తకాలు మాత్రమే ఉన్నట్లు రాసి ఉంది. ఒక కారు లేదు, టివి లేదు, సొంత ఇంటిని శాస్తవ్రేత్తల సంక్షేమానికి ఇచ్చేసారట.
అదంతా చదివిన సృజన సిగ్గుపడింది. మురిపెంగ చూసుకునే తల్లీదండ్రీ, చిన్నదో పెద్దదో సొంత ఇల్లు అన్నీ మరిచిపోయి గొడవ చేసేది తను.
అందం అనేది ఇంట్లో ఉండదు. అందులోని మనుష్యుల వ్యక్తిత్వంలో అనుబంధాల రూపంలో ఉంటుంది అనిపించింది సృజనకి.
‘‘అక్కా! ఏమాలోచిస్తున్నావు?’’ అన్న పాప మాటలకి ఇహలోకంలోకి వచ్చింది.
‘‘అన్నీ అతికించేసావుగా. ఈ రెండూ నేను అతికించుకుంటానులే. అమ్మ డ్రెస్ ఐరన్ చేసి తెస్తుంది’’ అంది.
‘‘అలాగే! నువ్వు బాగా చదువుకో’’ అంటూ ఆ రెండు పేపర్ కటింగులు కూడా అంటించేసి రమణమ్మ ఇచ్చిన డ్రెస్ తీసుకుని బయటికి నడిచింది.
సైకిల్ మీద వెళుతూ ‘‘నాన్నా! నువ్వే కరెక్ట్. మనకన్నా తక్కువ ధనం ఉన్నవారితో మనల్ని మనం పోల్చుకోవాలి. గుణం, జ్ఞానం మనకన్నా ఎక్కువ ఉన్నవారితో మనల్ని పోల్చుకోవాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం’ అనుకుంటూ తన అందమైన ఇంటి వైపు పయనమైంది సృజన.

- బి. రమ్య, సెల్ : 9704107077.