మీకు తెలుసా ?

కొబ్బరి కోసే కోతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిటారుగా, ఎత్తుగా ఎదిగే కొబ్బరిచెట్లు ఎక్కి కాయలను తెంపడం మనిషికి కష్టమైన పనే. పైగా ప్రాణానికి ప్రమాదంకూడా. కానీ కోతులకు అది పెద్దకష్టమైన పనికాదు. అందుకే ఒకజాతికి చెందిన కోతులను కొబ్బరికాయలు తెంపే పనిలో శిక్షణ ఇచ్చి వదులుతున్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, మలేషియాల్లో ఇందుకోసం ప్రత్యేక శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటికి మంచి డిమాండ్‌కూడా ఉంది. అయితే చెట్లెక్కి కాయలను తెంపేందుకు ఏ కోతి పడితే అది పనికిరాదు. ‘పిగ్ టెయిల్ మంకీ’కి పిలిచే ఒక రకం కోతులను మాత్రమే ఇందుకు వినియోగిస్తారు. బలిష్టంగా ఉండే వీటి తోకలు పంది తోకల్లా మెలి తిరిగి ఉంటాయి. అందుకే వాటికి ఆ పేరు వచ్చింది. పుట్టిన కొద్దిరోజులకే వాటిని తెచ్చుకుని పెంచి, శిక్షణ ఇస్తారు. ఐదేళ్లు వచ్చేసరికి అవి చెట్లనుంచి కొబ్బరికాయలు తెంపే పనిలో నైపుణ్యం సాధిస్తాయి. రోజుకు 500 కొబ్బరికాయలు తెంపే సామర్థ్యం వాటికి ఉంది. కోసినప్పుడల్లా వాటికి ఇష్టమైన ఆహారం బహుమతిగా ఇస్తూంటారు శిక్షకులు. పైగా వీటికి టోర్నమెంట్స్ కూడా నిర్వహిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కాయలు కోసిన కోతే ఛాంపియన్‌గా నిలుస్తుంది.
కొబ్బరిపూలతో ఓడ్కా
మనిషి రక్తంలో భాగమైన ప్లాస్మాకు ప్రత్యామ్నాయం కొబ్బరినీళ్లే. అవి తాగితే నేరుగా రక్తంలో కలిసి ప్లాస్మాగా మారిపోతాయి. మనిషికి ప్రకృతి ప్రసాదించిన వరం ఇది. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా బృందంలోని సెయిలర్లు ముందుగా కొబ్బరిని కనుగొన్నారు. స్పానిష్ భాషలో ‘కోకో’ అని మొదట పేరుపెట్టారు. కొబ్బరికాయలకు మూడుకళ్లు (చిల్లులు) ఉండటంతో దానికి ఈ పేరు పెట్టారు. ఆ తరువాత ఇంగ్లీషుభాషలో నట్ దీనికి చేరింది. నిజానికి ఇది ‘నట్’ కాదు. ‘డ్రూప్’గా పిలుస్తారు. దక్షిణ ఫసిఫిక్ దేశమైన న్యూగినియాలో ఇది పుట్టిందని అంటారు. ప్రస్తుతం 80 దేశాల్లో దీనిని సాగుచేస్తున్నాయి. వీటిలో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఇండియాల వరుసగా తొలి మూడుస్థానాల్లో నిలిచాయి. అన్నట్లు కొబ్బరిపూలనుంచి రసాన్ని సేకరించి కోకోనట్ ఓడ్కాను తయారు చేస్తారు తెలుసా.
సుగర్‌బీట్‌తో పంచదార
ఈ భూమీద పంచదార తయారీ రెండింటితోనే సాధ్యమవుతోంది. ఒకటి చెరకు. రెండోది సుగర్‌బీట్. బీట్‌రూట్‌కు చెందినదే ఇదికూడా. తెల్లగా ఉండే ఈ సుగర్‌బీట్‌లో చెరకులో ఉన్నంత సూక్రోజ్ ఉంటుంది. సరిగ్గా ఈ రెండింటిలో 95శాతం సూక్రోజ్ ఉంటుంది. అయితే చెరకుతో తయారు చేసే పంచదార తెల్లగా కన్పిస్తే సుగర్‌బీట్‌తో తయారయ్యే పంచదార కాస్త రంగు తక్కువగా ఉంటుంది. అయితే అమెరికావంటి దేశాల్లో సుగర్ అంటే రెండింటికీ సమాన ప్రాధాన్యతే ఉంది. పంచదార ప్యాకెట్లపై ప్రత్యేక హెచ్చరికలేం ఉండవు. అయితే కేవలం చెరకుతో తయారయ్యే పంచదారే కావాలంటే ‘ప్యూర్ సుగర్‌కేన్ సుగర్’ అన్న నోట్ చూసుకుని కొనుక్కోవాలి.
బీట్‌రూట్ ఎక్కువతింటే...
ఎర్రగా కన్పించే బీట్‌రూట్ దుంపలు మంచి పౌష్టికాహారం, పచ్చిగాను, వండుకుని దీనిని తినొచ్చు. అతిగా తింటే మూత్రం ఎర్రగా లేదా ఊదారంగులో వస్తుంది. దీనివల్ల నష్టం ఏమీ ఉండదు. బీట్‌రూట్ ముక్కలను నీళ్లలో మరిగించి, ఆ నీళ్లు చల్లారాక తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. ఒకప్పుడు బీట్‌రూట్‌ను రంగుల తయారీకి ఉపయోగించేవారు. ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉంది. బిటానిన్ అనే పదార్థంవల్ల బీట్‌రూట్‌కు ఆ రంగు వస్తుంది. దీనిని సంగ్రహించి ఆహారపదార్థాల్లో వాడే రంగులను తయారు చేస్తారు. అన్నట్లు మానసిక ఒత్తిడి, కుంగుబాటు తగ్గడానికి వీటిని ఔషధంగానూ వాడతారు. అన్నట్లు బీట్‌రూట్‌లు పసుపు, ఎరుపు, పర్పుల్, తెలుపు రంగుల్లోనూ ఉంటాయి.

-ఎస్.కె.కె.రవళి