నిజామాబాద్

మాతా శిశు మరణాలు తగ్గేందకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 20: జిల్లాలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గేవిధంగా అంగన్‌వాడీ, హెల్త్ సూపర్‌వైజర్లు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం హాల్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య కన్వర్జెన్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో గర్భిణులను గుర్తించి వారికి ప్రతి నెల అవసరమైన వైద్య పరీక్షలు చేసి అవసరమైన చికిత్సలు, అదనపు డోస్‌లను అందించాలని సూచించారు. బాలింతలకు, అప్పుడే పుట్టిన శిశువులకు అవసరమైన టీకాలను సమయానికి అనుకూలంగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా సూపర్‌వైజర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణిలు, బాలింతలు, 0-5సంవత్సరాల పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ల సేకరణ పక్రియను వేగవంతం చేయాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. పిహెచ్‌సి, సిహెచ్‌సిలకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఆసుపత్రి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని, అంగన్‌వాడీ, వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి దశ నుండే ఓటు హక్కుపై అవగాహన
జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి
ఇందూర్, జనవరి 20: విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే ఓటు హక్కు గురించి తెలుసుకుని, ఇతరులకు అవగాహన కల్పించే స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కు - దాని ప్రాముఖ్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుకు కల్పించిందన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సమాజాభివృద్ధికి 5సంవత్సరాలు పాటుపడే ఓ మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటరుకే ఉందన్నారు. అయితే చిన్ననాటి నుండి విద్యార్థులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని, ఓటు హక్కు అంటే ఏమిటీ, వయోజనులు ఎందుకు ఓటు వేయాలని, ఎలాంటి వ్యక్తులకు ఓటు వేస్తే సమాజం బాగుపడుతుందనే విషయాలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకరావాలన్నారు. ఓటును అమ్ముకోవద్దని, దాని శక్తిని నమ్ముకుని వేస్తే, ఫలితం సమాజాభివృద్ధిపై పడుతుందన్నారు. ఒకసారి వేసే ఓటు విలువ ఐదు సంవత్సరాల వరకు ఉంటుందనే విషయాన్ని ఓటర్లు మరిచిపోవద్దన్నారు. అందువల్ల ఓటు వేసే సమయంలోనే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వేయాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు రంగోళీ, ఉపన్యాసం తదితర పోటీలను నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జెసి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుదర్శన్, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.