నిజామాబాద్

మానవ మనుగడకు మొక్కలే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూలై 25: మానవ మనుగడకు మొక్కలే ఆధారమని, భావి తరాల మనుగడ మొక్కలతోనే సాధ్యమవుతోందని వ్యవసాయశాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి మండలంలోని అడివిలింగాల గ్రామ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌గౌడ్, ఎంపిపి గంగాధర్, జడ్పీటిసి సభ్యులు చినబాలి సామెల్ అడివిలింగాల గేటు వద్ద మంత్రికి పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలకు చేరుకున్న మంత్రికి విద్యార్థులు పూలు చల్లుతూ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ఆవరణలో మంత్రి వేప చెట్టును నాటి, నీళ్లను పోశారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పోచారం శ్రీనావాస్‌రెడ్డి మాట్లాడుతూ, మనిషి మనుగడకు, మొక్కలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మానవ మనుగడకు చెటే లఆధారమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ శాశ్వతంగా కరువు రాకుండాఉండేందుకోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం పథకాన్ని అమలు చేశారన్నారు. హరితహారం పథకం కింద ప్రతి ఒక్కరు మొక్కలను నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. నేడు నాటిన మొక్క రాబోయే భావి తరాల వారికి నీడనిచ్చే, పండ్లనిచ్చే చెట్లుగా పెరుగుతాయన్నారు. వర్షాలు కురవక పోవడానికి చెట్లు లేక పోవడమే కారణమని అన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అడవుల శాతం ఎక్కువ గా ఉండటంతో అక్కడ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు 200 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 770 టిఎంసిల నీరు సముద్రం పాలైందని అన్నారు. ఈనదులన్ని దట్టమైన అడవీప్రాంతాల నుంచి వస్తున్నాయని, దీనికి కారణం దట్టమైన చెటతో కూడిన అటవీ ప్రాంతమేనని అన్నారు. వర్షాలు కురవాలంటే భావి తరాల వారికి వారసత్వంగా దట్టమైన అడవులను అభివృద్ధి చేసి ఇవ్వాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా 46 కోట్ల మొక్కలను నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని, జిల్లాలో 3 కోట్ల 35 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని, వచ్చే సంవత్సరం 11కోట్ల 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకుని రాబోయే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకుంటే రాష్ట్రంలో 35 శాతం అటవీ ప్రాంతం పెరుగుతోందన్నారు. దీంతో కరువు కాటకాలు రావని అన్నారు. రాబోయే తరాలు గుర్తుంచుకునేలా మొక్కలను నాటాలన్నారు. నేడు నాటుతున్న మొక్కలకు అధికారులు, ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలన్నారు. ఇందుకోసం సిఎం కెసిఆర్ రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా, ఏ మండలంలో నైనా, ఏ గ్రామంలోనైనా ఆకస్మికంగా తనిఖీకి వచ్చే అవకాశ ముందని, సిఎం కెసిఆర్ తనకు ఫోన్‌లో చెప్పినట్లు మంత్రి తెలిపారు. నాటిన మొక్కలకు-లెక్కలకు పొత్తుకలవాలన్నారు. లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. మండలంలో మొక్కల కొరత కారణంగా 40 వేల మొక్కలు నాటే లక్ష్యం చేరుకోలేక పోయామని ఎంపిడిఓ సతీష్‌రెడ్డి మంత్రికి తెలిపారు. మండలంలోని 5 గ్రామాలో వంద శాతం మొక్కలు నాటే లక్ష్యం సాధించాయని ఎంపిపి గంగాధర్ మంత్రికి తెలిపారు. మొక్కలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి తెలిపారు. ఇటీవలే మండలానికి 72 వేల టేకు స్టంప్స్ వచ్చాయని, వాటిని ఎలా నాటాలోమంత్రి సమావేశంలో నాటే పద్ధతిని స్వయంగా చూపించారు. రాబోయే రోజుల్లో కరెంట్ కొరత లేకుండా ఉండేందుకు సిఎం కెసిఆర్ లక్ష కోట్లు కరెంట్ కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. జూన్ 1 నుంచి వ్యవసాయ రంగానికి 9 గంటల పగటిపూట విద్యుత్‌ను ఇస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో 24 గంటలపాటు వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిఎం కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ఆడపడుచులు నీటి కోసం పడ్తున్న కష్టాలను కళ్లార చూసిన రాష్ట్ర సిఎం ఏ ఒక్క ఆడపడుచు నీటి కోసం తంటాలు పడకుండా ఉండేందుకోసం మిషన్ భగీరథ పథకానికి 40 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఈసమావేశంలో కామారెడ్డి ఆర్డీఓ జి.నగేష్‌రెడ్డి, డిఎఫ్‌ఓ జోజి, తహశీల్దార్ నాగజ్యోతి, స్థానిక సర్పంచ్ బత్తిని దేవేందర్, వైస్‌ఎంపిపి నునుగొండ శ్రీనివాస్, ఎంపిటిసి సభ్యులు షకావత్‌అలీ, రాజశేఖర్, బట్టికాడి రవీందర్‌గౌడ్,గ్రామ సర్పంచ్ విమల పర్వయ్య, పాఠశాల హెచ్‌ఎం హరనాథ్‌మురళి, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రవణ్‌కుమర్, టిఆర్‌ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, పప్పువెంకటేశం, యూసప్, సింగల్‌విండోమాజీ చైర్మైన్ సాయాగౌడ్, రైతు నాయకుడుప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.