మీకు తెలుసా ?

పన్నెండేళ్లకోసారి పూసే నీల్‌కురింజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ కనుమలను నీలగిరులని పిలుస్తారుకదా..కానీ అక్కడ (తమిళనాడు-కేరళ) నీలం అంటే...ఊదారంగనే అర్థం. ఆ కొండలను దూరంనుంచి చూస్తే నీలవర్ణంలో కన్పిస్తాయి. సాధారణంగా అలా కన్పించినా పనె్నండేళ్లకోసారి మాత్రం ఆ కొండకోనలన్నీ అచ్చమైన నీలగిరులు (ఊదారంగుపూలతో)గా కన్పిస్తాయి. అందమైన నీల్‌కురింజి పూలు పెద్దఎత్తున వికసించి పశ్చిమ కనుమలన్నీ పూలపాన్పులైపోతాయి. ఈ పూలు వికసించినప్పుడు ఆ గిరుల అందాన్ని చూడటానికి లక్షల సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఈ అందమైన గొట్టంపూలలో ఉండే మధురమైన మకరందంకోసం మరేపూలకూ వెళ్లనన్ని సంఖ్యలో తుమ్మెదలు, తేనెటీగలు తరలివస్తాయి. ఈసారి ఈ సామూహిక పుష్పవిలాసం 2018లో వస్తుంది.
బంతిలా చుట్టుకుపోయే
హెడ్జ్‌హగ్
ఇది ముళ్లపంది కాదు. అలాగని ఎలుకా కాదు. ఓ క్షీరదం. చేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే ఈ హెడ్జ్‌హగ్స్‌కు శరీరం ఉపరితలం అంతా ముళ్లుంటాయి. ప్రమాదం ఎదురైతే శరీరాన్ని బంతిలా చుట్టేసుకుని ముళ్లను విప్పుతుంది. వీటి ముళ్లు ఏడాదికోసారి ఊడిపోయి, కొత్తవి మొలుస్తాయి. ముళ్లపందుల ముళ్లంత విషపూరితం కాకపోయినా వీటి ముళ్లూ ప్రమాదకరమైనవే. ప్రతి హెడ్జ్‌హగ్‌పై కనీసం 5వేల ముళ్లుంటాయట. అన్నట్లు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో వీటిని పెంచడం నిషేధం.

ఉల్లి...కుక్కలకు విషం
మనం ఎంత ప్రేమగా చూసుకున్నా పొరపాటున కూడా ఉల్లిపాయలు కుక్కలకు ఆహారంగా పెట్టకూడదు. నిజానికి మీరు పెట్టినా అవి ముట్టుకోవు. ఒకవేళ అవి తింటే వాటి రక్తంలో ఎర్రకణాలు తగ్గి అవి మరణిస్తాయి. ఉల్లిపాయలను తరిగినప్పుడు వచ్చే సల్ఫర్, మన కళ్లలోని డస్ట్‌తో కలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్‌గా మారడంవల్ల మన కళ్లు మండుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి, కళ్లను కాపాడటానికి కన్నీళ్లువస్తాయి. ఒకప్పుడు ఉల్లిపాయల్ని కరెన్సీగా కూడా వాడేవారు. అంటే కొన్ని వస్తువులను కొన్నప్పుడు వాటికి బదులుగా ఉల్లిపాయల్ని ఇచ్చేవారన్నమాట. ప్రపంచంలో సంవత్సరానికి సగటున ప్రతివ్యక్తి 13.7 పౌండ్ల ఉల్లిపాయల్ని తింటే లిబియన్స్ మాత్రం సగటున ఒక్కొక్కరు 66.8 పౌండ్ల ఉల్లిని తినేస్తారు. వారికి ఉల్లి అంటే ఎంతిష్టమో అర్థమైందిగా.
కాళ్లపై రాబందుల మూత్రవిసర్జన
ఔను...ఇది నిజమే సుమా. రాబందులు తమ కాళ్లపై మూత్రాన్ని విసర్జిస్తాయి. చచ్చిన జంతువులు, మృతదేహాలపై నడిచినప్పుడు కాళ్లద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా యాసిడ్‌తో సమానమైన తమ మూత్రాన్ని ఇలా విసర్జించి రక్షణ కల్పించుకుంటాయి. పైగా ఇలా చేసి కాళ్లకు ఉష్టతాపం లేకుండా చూసుకుంటాయి. ఈ భారీ పక్షులు ఆకాశంలో 32వేల అడుగుల ఎత్తునకూడా ఎగరగలవు. వీటి కాళ్లు మాత్రం బలహీనంగా ఉంటాయి. వీటి మెడపై వెంట్రుకలు ఉండవు. కుళ్లిన కళేబరాలను ఇవి పీక్కుతిన్నప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా, పరాన్నజీవులు అంటుకోకుండా ఈ వెసులుబాటన్నమాట. ఇక ఇవి తినే ఆహారంలో బ్యాక్టీరియా వీటిని ఏమీ చేయకుండా వాటి జీర్ణవ్యవస్థలో కొన్ని ప్రత్యేక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అందువల్లే కలరా, డయేరియా, ఆంత్రాక్స్, బొటాలిజమ్‌వంటి ప్రమాదకరమైన రోగాలకు కారకమయ్యే బ్యాక్టీరియా వీటిని ఏమీ చేయలేవు.

-ఎస్.కె.కె.రవళి