నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలఘు గుణ ప్రసిద్ధుడగు నట్టి ఘనుండొకడిష్టుడై తనున్
వలచి యొకించుకేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుగా
తెలిసి కుచేలుడొక్క కొణి దెండటుకుల్ దనకిచ్చినన్ మహా
ఫలదుడు కృష్ణుడత్యధిక భాగ్యము లాతని కీడె భాస్కరా!

భావము:ఓ భాస్కరా! అనంత కల్యాణగుణాలచే విఖ్యాతుడైన మహనీయుడు తన మిత్రుడు లేశమాత్రమైనా పదార్థాన్ని ప్రేమతో సమర్పిస్తే అతనికెంతో మేలు చేస్తాడు. కుచేలుడు ప్రేమతో పెట్టిన అటుకులు చారడైనా మహాఫలదాత అయిన శ్రీకృష్ణుడు అతని స్థితిని గ్రహించి అపార సంపదలను అనుగ్రహించలేదా!

భాస్కర శతకములోని పద్యము - కె. లక్ష్మీఅన్నపూర్ణ

భాస్కర శతకములోని పద్యము - కె. లక్ష్మీఅన్నపూర్ణ