నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. రథమును రథ్యంబులు సా
రథి యును వృథయైన భగ్నరథుఁడై భాగీ
రథి కొడుకు చేత విమనో
రథుఁడై సాల్వుండు నిజపురంబున కరిగెన్

భావం: భీష్ముడు సాల్వుడు అందరూ ఆశ్చర్యపోయేటట్లుగా బాణప్రయోగం చేసుకొన్నారు. వారిద్దరూ వీరులైనప్పటికీ భీష్ముని ధాటికి సాల్వుడు నిలువలేకపోయాడు. సాల్వుని రథమూ, సారథీ పనికిరాకుండా పోగా సాల్వుడు రథం విరిగిపోవడమే కాకుండా మనోరథం కూడా వీగిపోయేటట్లుగా భీష్ముడు చేసాడు. ఇక చేసేది ఏమీ లేక తన నగరానికి సాల్వుడు విఫల మనోరథుడై వెను తిరిగి వెళ్లిపోయాడు. ఈ విధంగా కాశీరాజు కుమార్తెల స్వయంవరానికి వచ్చిన రాజులను ఓడించి వారినందరిని నిలువరించి భీష్ముడు ఆ వధువులను తన తమ్ముడైన విచిత్ర వీర్యుని తో పెండ్లి చేయాలని తన రాజ్యానికి వారి మువ్వురినీ తీసుకొని వచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము