నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం కంటిమి నరకుడువడగా
మంటిమి నేడనుచు వెసనమర్త్యులు మునులున్
మింటం బువ్వులు గురియుచు
బంటింపక పొగడి రోలి బద్మదళాక్షున్
భావము: అమ్మయ్యా! నరకాసురుని వధను కన్నులారా చూశాము. ఇక మనం బ్రతికాము అని దేవతలు, మునీంద్రులు మింటినుండి వెంటనే పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని ప్రస్తుతించారు.

ఇల్లాలం గిటియైన కాలమున మునే్ననంచు ఘోషింతు వో
తల్లీ నిన్నుఁ దలంచియైన నిచటం దన్నుం గృపం గావఁడే
చెల్లంబో తలఁ ద్రుంచెనంచు నిల నాక్షేపించు చందంబునన్
దెళ్లెం జప్పుడు గాఁ గ భూమి సుతుఁ డుద్దీప్తాహవ క్షోణిపై
భావం: అమ్మా వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలినని చాటి చెప్పావు. నిన్ను చూచి అయనా నా పై దయచూపకుండా శ్రీకృష్ణుడు తల త్రుంచాడు. అని భూదేవిని నరకాసురుడు అధిక్షేపిస్తునట్లుగా యుద్ధరంగంలో నేలమీద కూలిపోయాడు.

బమ్మెరపోతన రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ