నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా॥ అంతామిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెఱింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్ధముందనువునిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుగాని పరమార్థంబైన నీయందు దా
జింతాకంతయు జింత నిల్పడు గదాశ్రీకాళహస్తీశ్వరా!

భావం: శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూచినచో ఈ జగత్తంతయు అసత్యము. మానవుడు సంతానము, సంపదల పట్ల ఆసక్తి వీడలేక మోహసముద్రమున పడి భ్రాంతిలో ఉండి తిరుగుతూ ఉంటాడు. నిన్ను పరమార్థముగా తెలుసుకోలేడు. నీ యందు ఇంచుకైనా మనస్సు నిలపడు. ఈస్థితి శోచనీయమైనది కదా. అంటాడు కవి. విషయం తెలిసిన తరువాత కూడా మానవుడు భ్రమలో పడుతూఉంటాడు అదే మాయ. ఈ మాయా ప్రపంచంలో భగవంతునిపైన ఎవరు భక్తిని కలిగిఉంటారో వారికి ఏమాత్రం ఈ మాయ అంటదు. వారు సర్వమూ భగవంతుని స్వరూపంగా భావిస్తారు కనుక మాయకూడా భగవంతునిగానే చూస్తారు వారు. భక్తిలేనివారికి మాత్రమే మాయామోహం అంటుతుంది.

యధావాక్కుల అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతకము పద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ