నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాసము లేక స్రుక్కిన జరాకృతమైన విశీర్ణమైన సా
యాసమునైన నష్టరుచియైనను బ్రాణ భయార్తమైన ని
స్త్రాస మదేభ కుంభ పిశిత గ్రహ లాలసశీల సాగ్రహా
గ్రేసర భాసమాన మగు కేసరి జీర్ణ తృణంబు యేయునే?

భావము: జంతువులకు రాజువంటిది సింహం. అభిమానం కల జంతువుల్లోకెల్లా మొట్టమొదటి ఎన్నదగినది అయిన సింహం ఆకలితో డస్సిపోయినా, ముసలితనంతో చిక్కిపోయినా, కీళ్ళు సడలినా, కష్టస్థితిని పొందినా, కాంతివిహీనమైనా, ప్రాణాపాయ స్థితిలో వున్నా, మదించిన ఏనుగు కుంభస్థలాన్ని పగులగొట్టి అందులోని మాంసాన్ని తింటుంది తప్ప ఎండు గడ్డిని తినదు.
మనుషులుకూడా ఏకష్టకాలమైనా సత్యధర్మాలను వీడరాదు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ