నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షమ కవచంబు, క్రోధమది శత్రువు, జ్ఞాతిహుతాశయనుండు, మి
త్రము దగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్య వి
త్త ముచిత లజ్జ భూషణ ముదాత్త కవిత్వము రాజ్యమీ క్షమా
ప్రముఖ పదార్థముల్ గలుగు పట్టున దక్కవ చాదులేటికిన్

భావం: ఓర్పు ఉంటే కవచం అక్కరలేదు! క్రోధం వుంటే హాని కలిగించడానికి శత్రువుతో పనిలేదు. దాయాది వుంటే వేరే నిప్పు అక్కరలేదు. స్నేహితుడుంటే ఔషధం అక్కరలేదు. దుష్టులుంటే భయంకరమైన సర్పాలు అక్కరలేదు. ఉదాత్తమైన కవిత్వం వుంటే రాజ్యంతో పనిలేదు. చక్కని విద్య వుంటే సంపదతో ప్రయోజనం లేదు. తగు రీతిని సిగ్గు వుంటే వేరే అలంకారం అక్కరలేదు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ