నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపదలు కల్గుతఱి మహాజనుల హృదయ
మభినవోత్పల కోమలంబగుచు వెలయు
నాపదలు వొందునపుడు మహామహీధ
రాశ్మ సంఘాత కర్కశంబై తనర్చు
భావము: సాధారణ జనులు సంపదలు కలిగినపుడు గర్వంతో వుంటూ కఠినంగా ప్రవర్తిస్తారు. ఆపదలు కలిగినపుడు తట్టుకోలేరు. అదే సజ్జనులైనవారు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు. వారికి సంపదలు కలిగినప్పుడు వారి హృదయాలు కలువపూలు మాదిరిగా కోమలంగా వుంటాయి. వారిలో గర్వకారణంగా వుండే కాఠిన్యం కనిపించదు. ఆపదలు వచ్చినపుడు మాత్రం వారి హృదయం పర్వతశిలలవలె కాఠిన్యం వహిస్తుంది. ఎంతటి ఆపదలనైనా భరించగలుగుతుంది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ