నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్యుమణి పద్మాకరము వికచముగాజేయు
గుముద హర్షంబు గావించు నమ్నతసూ
యర్థితుడు గాక జలమిచ్చు నంబుధరుడు
సజ్జనులు తారె పరహితాచరణమతులు

భావం: సజ్జనులెప్పడూ పరోపకారం చేస్తూనే వుంటారు. సూర్యుణ్ణి ఎవరు ప్రార్థించకున్నా అతడు తామర కొలకులను వికసింపజేస్తాడు. చంద్రుణ్ణి ఎవరు వేడుకోకున్న అతడు కలువలను వికసింపజేస్తాడు. మేఘాన్ని ఎవరు యాచించకున్నా అతడు నీటిని వర్షిస్తాడు. సత్పురుషులెప్పుడూ ఇతరులకు మేలు చేయడంలోనే ఆసక్తి చూపుతారు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ