భక్తి కథలు

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ధరణిసురమంత్ర హోమ
స్ఫురణను వివశులయి భూరి భుజగప్రభు లొం
డొరుఁ బిలుచుచు నధికభయా
తురులై కుండాగ్నులందుఁ దొరఁగిరి పిలుచన్
భావం: గృహనిర్మాణ నేర్పు ఉన్న బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న జనమేజయుడు పెద్దగా వాటిని చెవిన పెట్టలేదు. దాంతో చ్యవన మహర్షికులంలో ప్రసిద్ధుడైన చండభార్గవుడు హోతగాను, పింగళుడు అధ్వర్యుడుగా, శార్‌ఙ్గరవుడు ఒక ఋత్విజుడుగా, కౌత్సుడు ఉద్గాతగా, వ్యాసవైశంపాయనాదులైన మహర్షులు యజ్ఞవిధి పరీక్షకులుగా నల్లని వస్త్రాలు ధరించినవారును పొగల చేత ఎర్రబడిన నేత్రలు కలవారును అయి యజ్ఞతంత్రాన్ని నడిపే ఋత్విజులు అగ్ని సాధ్యమైన కర్మలకు అంగభూతమైన కర్మకలాపాన్ని చేసి నెయ్యి మొదలైన హోమ ద్రవ్యాలతో హోమం చేయడానికి ప్రారంభించారు. అపుడు బ్రాహ్మణుల మంత్రాల యొక్కయు, అగ్నిలో వ్రేల్చేపదార్థాల యొక్కయు ప్రభావం చేత వశం తప్పినవారై గొప్ప పాముల రాజులు ఒకరికొకరు పిలుచుకుంటూ ఎక్కువభయం చేత కలత నొందిన వారై హోమకుండంలోని అగ్నులలో శీఘ్రంగా పడ్డారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము