నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యసూక్తి ఘటించు, ధీజడిమ మాన్చు
గౌరవమొసంగు, జనులకు కలుషమడిచు
కీర్తి ప్రకటించు, చిత్తవిస్ఫూర్తి జేయు
సాధు సంగంబు సకలార్థసాధనంబు

భావము: సజ్జనులు అసత్యమాడరు. ఎల్లప్పుడూ సత్యానే్న పలుకుతారు. అందువల్ల సజ్జన సహవాసం సత్యవాక్యాలనే పలకించపజేస్తుంది. బుద్ధి వైశారద్యం కలిగిన సజ్జనులతో సహవాసం వల్ల బుద్ధిజాఢ్యం తొలగిపోతుంది. సజ్జనులు సన్మార్గంలోనే నడుస్తారు కాబట్టి వారికి సమాజంలో గౌరవం వుంటుంది. వారితో కలిసి వుండేవారికి కూడా గౌరవం లభిస్తుంది. పాపాలను దూరం చేస్తుంది. కీర్తిని వ్యాపింపజేస్తుంది. మనోవికాసాన్ని కలిగిస్తుంది. ఈ విధంగా సజ్జన సహవాసం సమస్త ప్రయోజనాలను సాధిస్తుంది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ