నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియతిచేత గదర్థితుండయిన ధైర్య
పరుని ధైర్య గుణము మాన్పంగ దరమె?
క్రిందు సేయంగ బడినట్టి కృష్ణపథుని
కీల యెందైన మీదుగా గెరలుగాదె!
భావము: ధైర్యవంతునికి ఒక్కొక్కప్పుడు దైవవశాత్తు దుఃఖాలు సంభవించినా అతని ధైర్యగుణాన్ని పోగొట్టడం సాధ్యంకాదు. అగ్నిని ఎంత తలక్రిందులు చేసినా దాని జ్వాలలు పైకి ప్రసరిస్తాయేకానీ క్రిందుగా ప్రసరించవు కదా! దానికి కారణం అది అగ్నికి సహజ లక్షణం.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ