నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుడు గురుండు, వాలు శతకోటి, సుపర్వులు వాహినీ పతుల్
సురభవనంబు కోట, మధుసూదనుడున్ సయిదోడు, దంతిది
క్కరిపతి గాక నొప్పు బలఘాతియు దాయల కోడెనాజిలో
శరణము దైవమే, పురుషశక్తి నిరర్థక మెన్ని భంగులన్

భావము: బృహస్పతి గురువై, వజ్రాయుధము ఆయుధమై దేవతలు సైనికులై స్వర్గము కోటయై, విష్ణుమూర్తితోడై దిగ్గజముల కధిపతియైన ఐరావతము గజమై తనకు తోడ్పడినా, ఇంద్రుడు రాక్షసులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయినాడు. కనుక దైవబలమే ప్రధానము కాని కేవల పురుషశక్తి ఎన్ని విధముల చూసినా కూడా నిరర్థకమే.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ