నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతభిషగాఢ్యుడున్ సతత శంభువతంసమునయ్యు, నోషధీ
తతులకు నాథుడయ్యును, సుధారససేవధియయ్యు, దారకా
పతి తన రాజయక్ష్మ భవబాధల బాపగా నోపడక్కటా!
హతవిధి కృత్యమెవ్వనికికైన జగంబున దాటవచ్చునే

భావము:చంద్రుడు శతభిషగాఢ్యుడు. అంటే శతబిషక్ అనే నక్షత్రంతో కూడినవాడు. దీనిని వివరిస్తూ కవి చంద్రుడు వందమంది వైద్యులతో కూడిన వాడు అని చెప్పాడు. చంద్రుని వెంట వందమంది వైద్యులుంటారు. శంకరునికి అలంకారంగా వుంటాడు. ఓషధులన్నింటికీ ఆయన రాజు. అమృతానికి నిధి. అయినా క్షయరోగపు బాధను అనుభవించడం తప్పడంలేదు. లోకంలో దైవ విధిని దాటడం ఎంతవారికైనా సాధ్యపడుతుందా?

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ