నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవ్వనికి నిజ్జగంబున నెంత ఫలము
దైవకృతమగునది వొందు దప్పకతని
గారణము గాదు పెనుబ్రాపు ఘనునిజేరు
చాతకము వాతబడు నల్పజలకణములు

భావము: ఎవరికి ఎంత ఫలితం దైవం నిర్ణయిస్తుందో అంత ఫలితం వారికి తనంతటనే తప్పక లభిస్తుంది. దీనికి గొప్పవారిని ఆశ్రయించవలసిన అవసరం లేదు. వర్షించే మేఘాన్ని ప్రతిదినం ఆశ్రయించే చాతకపక్షి నోటిలో చిన్న నీటి బిందువులు రెండో మూడో పడతాయి కానీ ఎక్కువ పడవు కదా! అన్నింటికీ దైవమే నిర్ణయిస్తుంది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ