నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసుధాఖండంబు వేడితో జగములన్ వాంఛించితో వాజులన్
వెసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో
పసిబాలుండవు నేర వీ వడుగ నీ భాగ్యంబులీపాటిగా
కసురేంద్రుండు పదత్రయంబడుగ నీయల్పంబు నీ నేర్చునే

భావము: బలిచక్రవర్తి వామనునితో నీవు కోరినది కొంచెమే అని చెబుతూ ‘‘్భభాగాన్ని కోరినావా? ఏనుగులను కోరినావా? గుఱ్ఱాలను కోరినావా? పెండ్లికాని జవరాండ్రను కోరినావా? నీవు పసిపిల్లవాడవు. నీకు అడగడం తెలియదు. అందువల్ల మూడు అడుగులే అడిగినావు. నీ అదృష్టం అల్పమైనది కావచ్చు. ఇంతటి రాక్షస చక్రవర్తి ఇంత అల్పమైనదానిని ఎట్లా ఇస్తాడు? ఈ విధంగా పలికిన బలి చక్రవర్తితో చిరునవ్వు చిందే ముఖంతో వామనుడు సమాధానమిచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ