నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో
వడుగేనెక్కడ భూములులెక్కడ కరుల్ వామాక్షులశ్వంబు లశ్వంబు బె
క్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూ
డడుగుల్ మేరయు త్రోవకి వచ్చుటది బ్రహ్మాండంబు నాపాలికిన్
భావము:వామనుడు బలి చక్రవర్తితో ‘‘అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగూ, జందెమూ, కమండలమూ, మొలత్రాడూ, యోగదండమూ అవసరము. అంతేకానీ భూములతో, ఏనుగులతో, గుఱ్ఱాలతో, స్ర్తిలతో నాకు పనిలేదు. వాటికీ నా నిత్యకృత్యాలకూ సంబంధం లేదు. కాదని త్రోసివేయకుండా నా కోరికకు తగినట్లు ఆ మూడడగుల చోటిస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండము.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ