నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిగుణ హీన లోభికి బదార్థము గల్గిన లేక యుండినన్
మితముగగాని కల్మిగలమీదటనైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద నేఱులు నిండి పారినన్
గతుకగ జూచు గుక్క తనకట్ట వీడ మీఱక యెందు భాస్కరా!
భావము:్భస్కరా! లోభము అనే హీన గుణమున్నవాడు పదార్థాలున్నా లేకున్నా, ఐశ్వర్యం కలిగిన తరువాత కూడా కొంచెమే భుజిస్తాడు. కానీ కడుపు నిండుగా తృప్తిగా తినడు. అంతేకాదు, అతడు తన కాయమూ, కలిమీ శాశ్వతమని విశ్వసిస్తాడు. నదులు నిండుగా ప్రవహించినా, కుక్క నీటిని గతుకుతుందే కానీ పీల్చుకుని తాగదు. శునక స్వభావం అలాంటిది.

భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ