నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీద, సనందనాది ముని సేవితపాద, దిగంతకీర్తిసం
పాద, సమస్త భూతపరిపాలన వినోధ విషాదవల్లికా
చ్ఛేద ధరాధినాధ కులసింధు సుధామయపాద, నృత్తగీ
తాది వినోద, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిథీ!

భావము:- భద్రాచలంలో నివసించే దశరథరామా! సంవదలిచ్చువాడవు. సనకుడు, సనందుడు మొదలైన ఋషులచేత సేవించబడి పూజింపబడేవాడవు. విస్తృతమై దిక్కుల చివరి వరకు వ్యాపించిన కీర్తికలవాడవు, లోకములోని అన్ని ప్రాణులనూ కాపాడేవాడవు. ఆశ్రీతుల దుఃఖమును పోగొట్టేవాడవు. అడవుల్లోని ముళ్ళ తీగల్లాంటి మానవుల దుఃఖాలు అనే తీగలను ఖండించి వారి దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీరాముడు. క్షత్రియ వంశమనే జలధికి చంద్రునివంటి వాడవు. ఆట పాటల యందు వేడుక కలవాడవు.

దాశరథీ శతకములోని పద్యము
**

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003