నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్యులకెల్ల మ్రొక్కి వినతాంగుడై రఘునాథ భట్టరా
చార్యుల కంజలెత్తి కవిసత్తములన్ వినుతించి కార్య సౌ
కర్యమెలర్చ నొక్క శతకం బొన గూర్చి రచింతు నేడు తా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ! కరుణాపయోనిధీ!

భావము:- నేను వినయముతో పెద్దల కందరికీ నమస్కరించి, మా గురువులైన రఘునాథ భట్టరాచార్యుల వారికి చేతులు జోడించి మ్రొక్కి, పూర్వీకులను స్తుతిచేసి, నేను చేసే రచన సుకరముగా - సులభముగా - నెరవేరగా ఇప్పుడు శతకమనే కావ్యాన్ని వ్రాస్తున్నాను. కరుణా సముద్రడవైన ఓ భద్రాచలరామా! ఈ శతకాన్ని మంచి అభిప్రాయముతో స్వీకరించుము.