నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రఘువంశతోయధికి శీతమయూఖాడవైన నీ పవి
త్రోరు పదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరిత వాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనారు, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

భావము: చంద్రుడు తాను పట్టిన సముద్రాన్ని వర్థిల్లజేసిన విధంగా రఘు మహారాజు వంశమున పుట్టి దానిని వృద్ధి చేసిన వాడవైన నీ పవిత్ర పాదారవిందములను ఉత్పలము, చంపకము అనే పుష్పాలతో పూజించిన విధంగా శబ్దాలతో కూడిన చంపకమాల, ఉత్పలమాల అనే పద్యాలతో పూజిస్తున్నాను. భద్రాచలంలో నివసించే దయాసముద్రడవైన సంసారమును తరింపజేసే రామా! దానిని స్వీకరింపుము.