నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విన్న పమాలకించు రఘువీర, వహిప్రతిలోకమంచు నా
కన్న దురాత్ముఁడుం బరమ కారుణి కోత్తమ, వేల్పులందు నీ
కన్న మహాత్ముఁడుం బతితకల్మష దూరుఁడు లేఁడు నాకు వి
ద్వన్ను త నీవె నాకు గతి! దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ రఘువీరా , ఒక మనివి ఆలకింపుము. ఏ లోకంలోను, నాకంటె దుష్టుడు లేదు. దేవతలతో నీ కంటె మహాత్ముడు లేడు. పాపాత్ములను ఉద్దరించే వాడు, వారి పాపాలను నిర్మూలించే వాడు లేడు. అందుచేత దుష్టులలో శ్రేష్ఠుడవైన నాకు, దేవతలలో శ్రేష్ఠుడవైన నీవు దిక్కు గా ఉండి ఆధారంగా ఉండి ఉద్దరింప శక్తుడవగుదువు. గాని మరి ఒకరు కాజాలరు.

దాశరథీ శతకములోని పద్యము