నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా. విద్వన్ముఖ్యుఁడు ధర్మమూర్తి త్రజగద్విఖ్యాత తేజుంటు కృ
ష్ణాద్వైపాయనుఁ డేగుదెంచి, సుత శిష్యబ్రహ్మసంఘంబుతో
సద్వంద్యుండు సదస్యుఁ డయ్యె ననినన్ శక్యంబె వర్ణింప సా
క్షాద్విష్ణుండన నీవు భూపతులలో ఁ గౌరవ్యవంశాగ్రణీ

భావం: కౌరవ వంశ్యులలో శ్రేష్ఠుడా జనమేజయా! విద్వాంసులలో శ్రేష్ఠుడవు, మూర్తి తాల్చిన ధర్మం, ముల్లోకాలలో ప్రసిద్ధమైన తేజం కలవాడు, సుజన వందనీయుడు అయిన వ్యాసమహర్షి స్వయంగా కుమారుడితోను, శిష్యులతోను ఋత్విజుల సముదాయంతోను వచ్చి నీ యజ్ఞంలో సదస్యుడైనా డంటే నీ యజ్ఞాన్ని, నిన్నూ వర్ణింప తరమవుతుందా? రాజులలో నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తివే. అంటూ జనమేజయుని దగ్గరకు వచ్చిన ఆస్తీకమహాముని మహారాజును పొగుడుతూ మాట్లాడుతున్నాడు. ఆచక్రవర్తి హృదయాన్ని గెలుచుకుని సర్పయాగాన్ని నిలుపుదలచేయమని అడగబోతున్నాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము