నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాసవ రాజ్యభోగ సుఖవార్థిని తేలు ప్రభుత్వమబ్బినా
యాసకు మేర లేదు కనకాద్రి సమాన ధనమ్ము గూర్చి నం
గాసును వెంటరాదు, కవి కానక చేసిన పుణ్యపాపముల్
వీసర బోవ నీవు, పదివేలకు జాలు భవంబు నొల్ల నీ
దాసుని గాక నేలి కొను దాశరథీ కరుణా పయోనిధీ
భావము: స్వర్గ్ధాపతి అయిన ఇంద్రుని భోగమునకు సమానమైన సౌఖ్యం లభించే అధికారం దొరికినప్పటికీ ఆశకు అంతం లేదు. తృప్తి లేదు. బంగారు కొండకు సమానమైన ధనం ప్రోగుచేసినా మరణించినప్పుడు ఒక్క కాసు అంటే రాగి నాణెము కూడా వెంటరాదు. మానవ సహజంగా తెలిసీ తెలియక చేసిన దోషాలు వెలితిపడనీయవు. అనంతమై అసంఖ్యాకమైన అనర్థాలకు సమర్థమైన జన్మను నేను అంగీకరించను. నీవు ఓ రామా! నన్ను దాసునిగా అంగీకరించి పరిపాలించి రక్షించుము.

దాశరథీ శతకములోని పద్యము