నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకర దుర్గమై దురిత సంకులయైన జగము జూచి స
ర్వంకషలీల నుత్తమ తురంగము నెక్కి- కరాసి బూని నీ
రాంక విలాస మొప్ప గలికాకృతి సజ్జన కోటికిన్ నిరా
తంకమొనర్చె తీవె కద! దాశరథీ కరుణా పయోనిధీ!

భావము:దశరథరామా, వర్ణ సాంకర్యము చాలా బలీయమై పాపాలు దట్టంగా వ్యాపించి వున్న జగమును చూచి అంతట వ్యాపించిన భగవానుని విలాసముతో గొప్ప మేలైన అశ్వాన్ని అధిరోహించి చేత కత్తి పట్టుకుని వీరునికి తగినట్టి సత్య పరాక్రమమే నీ విలాసము కాగా కల్కి మూర్తివై సజ్జనులకు మంచి పనులలో కష్టము, ఆటంకము లేకుండునట్లు నిర్వహించేవాడవు నీవే కదా!

దాశరథీ శతకములోని పద్యము