నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమున నూహపోహణలు మర్వకమునె్న, కఫాదిరోగముల్
దనువునంటి మేని బిగి దప్పకమునె్న నరుండు మోక్ష సా
ధనమొనరింపగా వలయు దత్త్వవిచారము మానియుండుటల్
తనువునకున్ విరోధమది దాశరథీ కరుణా పయోనిధీ

భావము:దశరథరామా, మనస్సుకు ఆలోచించుకునే శక్తి తలంచుకునే శక్తి నశించడానికి పూర్వమే కఫము మొదలైన రోగములు దేహంలో వ్యాపించి దాని శక్తిని హరించడానికి ముందే మనుష్యుడు తత్త్వము అంటే పరమాత్మను గురించి విచారము చేసి మోక్షమునకు తగిన ఉపాయములను చేసికొనవలెను. తరువాత ఇటువంటి ప్రయత్నం చేయడం సాధ్యం కాదు. తత్త్వవిచారం చేయకపోవడం ఆత్మస్వరూప ప్రభావాలకు విరుద్ధమైంది.

దాశరథీ శతకములోని పద్యము