నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరు సురలును దనుజులు
పొందుగ క్షీరాబ్ది ఁ దరువ పొలువున నీ వా
నందముగ కూర్మ రూపున
మందరగిరి యెత్తి తౌర మాధవ! కృష్ణా!

భావం: దేవదానవులు కలసి క్షీర సముద్రమును చిలుకునపుడు నీవు మహా కూర్మ రూపముతో వెలసి కవ్వముగా నున్న మందర పర్వతమును పై కెత్తిన వాడవు. అది మహాశ్చర్యము. ఒకసారి గర్వోన్నతితో మెలిగిన ఇంద్రుని వలన దానవులు విజృంభించారు. వారు ఇంద్రపదవిని చేజిక్కించుకున్నారు.దేవతలు మన్నించమని నారాయణుడిని వేడుకున్నారు. ఆయన మాట ప్రకారం దేవతలు దానవులతో సంధి చేసుకొని పాలసముద్రాన్ని మధించారు. ఆ మధించేటపుడు మందరపర్వతం కవ్వం అయినా, వాసుకి తాడుగా నిలిచినా కూడా క్షీర సాగరాన్ని మధించలేక పోయారు దేవదానవులు. అపుడు ఆ మందర పర్వతాన్ని పైకెత్తి నిలిపి ఉంచడానికి మహావిష్ణువు కూర్మావతారునిగా అవతారం దాల్చాడు. అది మహాద్భుతం.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము