నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశకంఠుని బరిమార్చియు
కుశలముతో సీత దెచ్చికొనియు నయోధ్యన్
విశదముగ కీర్తి నేలితి
దశరథ రామావతార ధన్యుడ! కృష్ణా!

భావం: దశరథునికి మహావిష్ణువు రామునిగా పుట్టాడు. దాశరథిగా కీర్తించబడ్డాడు. పితృవాక్యపరిపాలకుడుగా ప్రఖ్యాతిపొందాడు. జనక సుత సీతమ్మను వివాహం చేసుకొన్నాడు. సీతాలక్ష్మణ సమేతుడై వనవాసానికి వెళ్లాడు. అక్కడ రావణుడు సీతమ్మను అపహరించాడు. రాముడు వానరులను వెంటబెట్టుకొని లంకకు వెళ్లి అక్కడ రావణుని నిర్జించి సీతమ్మను తీసుకొని వచ్చాడు. వనవాసానంతరం సీతారాములు అయోధ్యలో పట్ట్భాషిక్తులయ్యారు. ముల్లోకాలు కీర్తిచేట్టుగా రాముని పాలన కొనసాగింది.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము