నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనులకు ధేనుక ముష్టిక
దనుజుల చెండాడి తౌర! తగ భుజ శక్తిన్
అనఘాత్మ! రేవతీపతి
యనఁగన్ బలరామమూర్తి వైతివి కృష్ణా!

భావం: శ్రీకృష్ణా! ధేనుక ముష్టికాసురులను వధించినట్టివానివి నీవు. రేవతీదేవికి భర్తయైనట్టియు బలరామమూర్తివీ నీవే. అగ్నిపురాణంలో బలరాముడు నవమఅవతారునిగా అనంతమూర్తిగా వర్ణించబడ్డాడు. దేవకీదేవి గర్భాన్ని ఆకర్షించి రోహిణి గర్భంలోనిక్షేపింపగా అవతరించినవాడు కనుకనే బలరామునికి సంకర్షణుడను పేరేర్పడింది. బలరాముడే కాదు ఈ సర్వ సృష్టి అంతా కూడా శ్రీకృష్ణుడే నిండి ఉన్నాడు. శ్రీకృష్ణుడు తప్ప అన్యమేదీ లేని విశ్వం ఇది.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము