నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాసుర భార్యల నతి
నిపుణతతో వ్రతము చేత నిలిపితి కీర్తుల్
కృపగల రాజవు బళిరే!
కపటపు బౌద్ధావతార! ఘనుడవు కృష్ణా!

భావం: బుద్ధావతారాన్ని గూర్చి పలు అభిప్రాయాలున్నవి. త్రిపుర రాక్షసుల యొక్క భార్యలను, నేర్పు తో వ్రతాదులు చేయించి వారికి యశములను స్థిరపరిచితివి. నీ అవతార రహస్యాలను కనుగొనడం చాలా కష్టసాధ్యం. అన్నీ తానై ఉన్న పరమాత్మ గురించి తెలుసుకోవడం మహామహులకే కష్టసాధ్యమైంది. ఆయన లీలలన్నింటినీ అర్థం చేసుకోవడం కూడా కష్టసాధ్యమే. భక్తితో సాధన చేస్తే భగవంతుని లీలలు అవగాహనకు వస్తాయ.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము