నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ కువలయశ్యామ! నీ కొలువుచేసిన నాకు
జీతమెందుకు ముట్టఁజెప్పవైతి
మంచి మాటల చేత కొంచెమియ్యఁగ లేవు
కలహవౌనికఁ జుమ్ము ఖండితముగ
నీవు సాధువుగాన నింతపర్యంతంబు
జనువుచే నిన్నాళ్లు జరుపవలసె
నిఁక నే సహింపనీ విపుడు ననే్నమైన
శిక్షఁజేసిన చేయు సిద్ధ మైతి

తే॥ నేడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ
దెగఁబడెదఁ జూడు నీతోడ జగడమునకు
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నల్లనయ్యా! నీ సేవ చేశానుగదా! నాకెందుకు జీతమియ్యవు? మంచిగా అడిగితే ఇచ్చేవాడివిగాదు - తగవు లాడవలసి వస్తుంది సుమా! నీవు సాధుశీలుడవని ఇన్నాళ్లు చనువుతో ఊరకున్నాను. ఇక తాళలేను. నన్ను నీవు హింసించినా సరే కరుణించకపోయావో ఇక నీతో జగడానికి సిద్ధం చూడు.