నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహశతక
సీ॥ వేదముల్ చదివెడు విప్రవర్యుండైన
రణము సాధించెడు రాజులైన
వర్తక కృషికుఁడౌ వైశ్యముఖ్యుండైనఁ
బరిచరించెడి శూద్రర్యుఁడైన
మెచ్చు ఖడ్గముఁబట్టి మెఱయుమ్లేచ్ఛుండైన
ప్రజల కక్కఱపడు రజకుఁడైన
చర్మమమ్మెడి హీనచండాలపరుఁడైన
నీ మహీతల మందునెవ్వడైన
తే॥ నిన్నుఁ గొనియాడుచుండెనా నిశ్చయముగ
వాఁడు మోక్షాధికారి రుూ వసుధలోన
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
భావం: ఓ నరసింహ ప్రభూ! వేదాలు చదివిన బ్రాహ్మణుడుగాని, యుద్ధం చేసే క్షత్రియుడు గాని, కృషి వాణిజ్యాలు చేసే కోమటిగాని, సేవచేసే శూద్రుడు గాని, ఖడ్గం పట్టే మ్లేచ్ఛుడుగాని, ప్రజలకు ఉపయోగపడే చాకలిగాని, చర్మాన్ని అమ్మే చండాలుడుగాని వీరే గాదు మరెవ్వడు గాని నిన్ను స్తుతించే వాడయితే చాలు అతడు తప్పక మోక్షార్హుడే.