నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. తల వడఁక దొడఁగె నింద్రియ
ముల గర్వ మడంగె నంగములు వదలె వళీ
పలితంబు లయ్యె వగరును
దలయేరును నుక్కిసయును దరికొనుదెంచెన్
భావం: శుక్రాచార్యుడు తన కూతురైన దేవయాని చెప్పిందంతావినేసి మిక్కిలి కోపంతో యయాతి మహారాజు ను శపించాడు. యయాతి మాన్లవదనుడై గురువుగారిని నేను శర్మిష్ఠ కోరికను కాదంటే భ్రూణ హత్య చేసిన పాపానికి గురి అవుతాననే భయంతో ఆమె కోరికను తీర్చాను. అది కూడా నా బాధ్యతే కదా.. అని వేడుకోగా శుక్రుడు కోపం తగ్గి శాప తీవ్రతను తగ్గించాడు. నీకు వచ్చిన ముసలి తనాన్ని నీ కొడుకులెవరైనా తీసుకొని వారి యవ్వనాన్ని నీకు ఇస్తేమంటే తీసుకో.... తరువాత నీకిష్టమొచ్చినపుడు నీ ముసలితనం నీవు తీసేసుకుని వారి యవ్వనాన్ని తిరిగి ఇచ్చే వరాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. పైగా నీ ముసలి తనాన్ని ఎవరు తీసుకొంటారో వారికే నీ రాజ్యసంపద దక్కుతుంది అని చెప్పాడు. అది విని రాజాంతఃపురానికి వచ్చిన యయాతిలో మెల్లమెల్లగా తల వణకటం మొదలు పెట్టింది. ఇంద్రియాల మదం అణిగింది. అవయవాలు సడలినాయి. వెంట్రుకలు నెరిశాయి. ఉబ్బసం , తలనొప్పి, పొడి దగ్గు కలిగాయి....

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము