నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
చ. అగణితజన్మ కర్మ దురితాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడ నీఁదలేక, జగతీ ధవ నీపదభక్తి నావచే
దగిలి తరింపఁ గోరితి ఁ బదంపడి నాదు భయంబు మాన్పవే
తగదని చిత్తమందిడక దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: ఓ లోకనాథా! రఘురామా! లెక్కింపరాని జన్ములందలి కర్మపరంపరల చేత కలిగిన పాపాలు సముద్రం లాగా ఆపారంగా ఉన్నాయి. ఆపాపాల వల్ల అనేక దుఃఖాలు కెరటాలలా వచ్చిపడుతూనే ఉన్నాయి. వాటిని నాయంతట నేను నిర్మూలించుకోవడం సాధ్యం అయ్యే పని కాదు. అందుచేత నీ పాదముల భక్తి కలిగి, దానిని ఓడలాగా చేసికొని ఈదరాని సముద్రాన్ని ఓడ సాయం చేత సులభంగా దాటినట్లు నా పాపాలను తేలికగా పొగొట్టు కొనదల్చినాను. నా ఈ సంకల్పాన్ని నీవు తగినది కాదు అని నిరాకరించక స్వీకరించి నా వెరపును భయాన్ని నిర్మూలవించుమా
వ్యాఖ్యానం: భారతీయ ఆధ్యాత్మి జీవనంలో జన్మాంతరములపై విశేషమైన విశ్వాసం కనిపిస్తుంది. ఒక జీవితంలో జన్మాంతరములపై విశేషమైన విశ్వాసం కనిపిస్తుంది. ఒక జీవితంలో సత్కార్యాలు చేస్తే మరొక జీవితంలో మంచి ప్రవర్తన ఏర్పడుతుందని, మోక్షం లభిస్తుందని మనవారి విశ్వాసం. ఆవిధంగా కవి పూర్వజన్మ పాపకర్మల వల్ల ఈ సంసార సాగరాన్ని ఈదలేకపోతున్నాను. కనుక నీ నామమనే ఓడ నెక్కి నీపై భక్తి అనే తెడ్డును పట్టుకొని ఈ సంసార సాగరాన్ని దాటాలని ప్రయత్నం చేస్తున్నాను. నీపై భక్తివిశ్వాసాలు నాలోమెండుగా ఉండేటట్లు చేసి, నన్ను కాపాడు అని కవి రాముని ప్రార్థిస్తున్నాడు.