నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నీలఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁ గోరి వేడినన్
జాలము చేసి డాగెదవు, సంస్తుతి కెక్కిన రామనామమే
మూలను దాచుకోఁగలవు ముక్తికిఁ బ్రాపతి ప ఆదపమూలకు
ద్దాలము గాదె మా యెడల దాశరథీ కరుణా పయోనిధీ!

భావం: ఓ దశరథరామా! నల్లని మేఘం వలె ప్రకాశించే నీ స్వరూపాన్ని కన్నార చూడాలని ఎంత ప్రారిథంఛినా, మాయచేసి, ఆలస్యం చేసి దాచుకొంటావు. కనిపించక ఉంటావు. మంచిది. నీవు దాగినా, ప్రసిద్ధమైన వనె్నకెక్కిన నీ రామనామాన్ని నీవు ఎక్కడను దాచి పెట్టుకోలేవు. మా పాపము అనే వ్రేళ్లను పెళ్లగించి నిర్మూలించే గుద్దలి వంటిసాధనము రామనామమే కదా.

వ్యాఖ్యానం: కవి కినుక ఈ పద్యంలో కనిపిస్తుంది. ఎంత ప్రార్థించిని, వేడినా కనిపించవేమి రామా అని ఆర్ద్రతతో అడుగుతున్నాడు. శ్రీరాముని నల్లని మేఘంతో పోల్చడంలో ఎన్నో అర్థాలున్నాయ. స్పష్టంగా కనిపించకుండా నల్లనిరంగులో ఉన్నావని, అందరినీ ఇది నిజమా కలనా అనే మాయలో పడేసే స్వభావం కలవాడు ఆయన మాయలను కనుగొనడం ఎవరికి సాధ్యం? అందువలననూ, చారడేసి కనులతోను, పొడవైన బాహువులతోను, చల్లని చిరునవ్వుతో, అమితమైన పరాక్రమంతోను భక్తులను, ఆర్తులను రక్షించే స్వామిని చల్లని స్వామి అంటూ ఎన్నోరకాలుగా కీర్తిస్తూనే ఒక్కసారి కనిపించమని కవి వేడుకుంటున్నాడు.