నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. మనమున నూహపోహణలు నుర్వక మునె్న, కఫాది రోగముల్
దనువున నంటి మేనిబిగి దప్పక మునె్న, నరుండు మోక్ష సా
ధన మొనరింపఁ గావలయుఁ దత్త్వవిచారము మాని యుండుటల్
తనువునకున్ విరోధమది దాశరథీ కరుణాపయోనిధీ!

భావం:దశరథ రామా! మనస్సుకు ఆలోచించుకొనే శక్తి , తలంచుకొనే శక్తి , నశించడానికి పూర్వమే కఫము, మొదలైన రోగములు దేహంలో వ్యాపించి దాని శక్తిని హరించడానికి ముందే మనుష్యుడు తత్త్వము అంటే పరమాత్మను గురించి విచారము చేసి మోక్షమునకు తగిన ఉపాయములను చేసికొనవలెను. తరువాత ఇటువంటి ప్రయత్నం చేయడం సాధ్యంగాదు. తత్త్వ విచారం చేయకపోవడం ఆత్మ స్వరూప ప్రభావాలకు విరుద్ధమైంది.

వ్యాఖ్యానం: ఈ పద్యంలో కవి మానవుని శరీరం అల్పమైందని , జీవిత కాలం క్షణికమైనది, శరీరం ఎప్పుడైనా రోగ గ్రస్తం కావచ్చునని శరీరరంలో బలం ఉన్నప్పుడే పరమాత్మను గురించి విచారించి మోక్ష సాధనానికి మార్గం ఆలోచించుకొనవలెనని, ఇట్లు చేయక పోవడం మానవ జన్మ తత్త్వానికి విరుద్దమని చెబుతున్నాడు. దాశరథీ శతకంలో చాలా పద్యాలు ఆత్మాశ్రయాభావంతో కూడినట్టివే. కాని, ఈ పద్యంలో కవి సాటి మానవులకు జాగృతి కలిగించడానికి ఉపదేశపూర్వకమైన వాక్యాలు వ్రాసి తన సామాజిక బాధ్యతను నిర్వహిస్తూన్నాడు. మానవులు భౌతిక సౌఖ్యాలకు లోను గాక ఆధ్యాత్మిక చింతన చేసి తరించమనే మానవ లోకానికి దీని సందేశం.