నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. దురితల తానుసారి భవ దుఃఖదంబము రామనామభీ
కరతర హేతిచేఁ దీగి పకాపకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాదికీటకో
త్కరము విలీనమై చనదె ? దాశరథీ కరుణాపయోనిధీ!

భావం:దశరథ రామా! ఇపాపము తీగలవలె అనసరించగా దానితో కూడా సాగు దుఃఖాత్మకమైన జన్మ పరంపర వాడియైన ఖడ్గము చేత తీగముక్కలైనట్లు రామనామము చేత నశించి పటాపంచలౌతుంది. అంటుకుని మండుచున్న అగ్నికి దగ్గరగా వచ్చిన మిడుతలు మొదలైన పురుగుల సమూహం ఆ అగ్నిలో పడి నశించదా?

వ్యాఖ్యానం: ప్రతిమనిషి కర్మ చేయకుండా ఎలా ఉండడో అట్లే తెలిసో తెలియకో చిన్నదో పె ద్దదో పాపానికి ఒడిగడుతున్నాడు. కొందరు జ్ఞానులు పుట్టుకనుంచే ఏది పాపమో ఏది పుణ్యమో తెలుసుకొని విచక్షణతో మెలుగుతున్నారు.వారికేవిధమైన పాపరాశులు ఉండడం లేదు. కానీ మిడిమిడి జ్ఞానమున్న మానవులు సామాన్యులు అజ్ఞానంతోనో, అహంకారంతోనో పాపాలను చేస్తూనే ఉన్నారు. వారి పాపాలు వారిని జన్మజన్మల వరకూ వెంటాడుతూనే ఉన్నాయి. కనుక ఈ పాపాలను దూరం చేసుకోవడానికి గాను భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తూ వస్తున్నారు. అట్లా పాపాలు చేసినవారు ఏమాత్రం భయంలేకుండా నిర్మలమైన మనస్సు విశ్వాసంతో, గట్టి నమ్మకంతో చంచల స్వభావాన్ని వీడి వారు నీ పాదాలను పట్టుకొన్నట్లు అయితే ఎంత పాపరాశి కొండవలె భయపెట్టినను అది అంతా నిముషంలో పటాపంచలు అవుతుంది కదా. నీ నామోచ్చారణ చేసిన వెంటనే పాపాలు దరికి రావు.