నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం శివాప్రియాయ నమః
భర్తకై తప్చి కైశించి వడసినట్టి
పార్వతికి దేహమున నగభాగ మిచ్చె
హృదిని కదిలించె సతిప్రేమ మృదు సుమాల
ఇటు ‘శివాప్రియ’యను నామ మిలను కలిగె
ఓం కపాలినే నమః
బ్రహ్మతల ద్రుంచి తత్పాప పంకిలమును
పుర్రె పట్టి భిక్షాటనంబున నశింప
జేసుకొనె తప్పులకు శిక్ష సిద్ధమనుచు
బోధ చేసె ‘కపాలి’యై పురహరుండు
ఓం కామారినే నమః
సంద్రమున కెరటాలుగ సంభవించు
కోర్కెలకు అంతమున్నద? కోరికలను
తామరాకుపై జలముగ తలచుమనుచు
పాఠమును చెప్పు ‘కామారి’ భవుని తలతు
ఓం అంధకాసుర సూదనాయ నమః
అంధకాసురు గెల్చి శూలాగ్రమంతు
నిల్పగా సామగానము సల్పి, ఏడ్చు
వాని మన్నించి ప్రమథ గణాన చేర్చి
అంధకాసుర సూదనుడయ్యె శివుడు

కడియాల మధుసూదన రావు 9030907191